Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

వరదలో కొట్టుకుపోయిన ఎన్టీవీ జర్నలిస్టు జమీర్ …చెట్ల పొదల్లో చిక్కుకున్నమృతదేహం!

వరదలో కొట్టుకుపోయిన ఎన్టీవీ జర్నలిస్టు జమీర్ …చెట్ల పొదల్లో చిక్కుకున్నమృతదేహం!
-జగిత్యాలలో వరదల్లో చిక్కుకున్న కూలీల వార్తను కవర్ చేయడానికి వెళ్లిన జమీర్
-వరదలో కారుతో సహా కొట్టుకుపోయిన జర్నలిస్టు
-శుక్రవారం ఉదయం కారును వెలికి తీసిన అధికారులు
-జమీర్ మృతి పట్ల ఎమ్మెల్సీ కవిత సంతాపం

వరదల్లో చిక్కుకున్న కూలీల వార్తను కవర్ చేయడానికి వెళ్లిన జమీర్ (34 ) తానే వరదల్లో చిక్కుకొని మృతిచెందిన సంఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గత పదిసంవత్సరాలుగా ఎన్టీవీ లో పనిచేస్తున్న జమీర్ మంచి వ్యక్తిగా గుర్తింపు పొందారు . చురుకైన విలేకరిగా పేరుంది . సమస్యలపై స్పందించే మనస్తత్వం …ఎక్కడ ఎవరికీ ఇబ్బంది వచ్చిన తానున్నానని చెప్పే జమీర్ లేకపోవడం బాధాకరం .

మూడు రోజుల క్రితం తన స్నేహితుడు విషాద్ తో కలిసి నది ప్రవాహంలో ఒక లంక దగ్గర కొంతమంది కూలీలు చిక్కున్నారన్న విషయం తెలిసిన జమీర్ ఆ వార్తను కవర్ చేసి తన మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలపాలని వెళ్లిన జమీర్ తిరిగిరాని లోకాలకు వెళ్లడం మీడియా సమాజాన్ని నివ్వెరపోయాలా చేసింది. వార్త తన కెమెరాలో బందించి విషయాన్నీ అధికారులకు సైతం చెప్పి వారిని రక్షించేందుకు చెర్యలు తీసుకోవాలని కోరిన జమీర్ తన రక్షణ విషయం పట్టించుకోకపోవడం దురదృష్టకరం .వార్త కవర్ చేసి తిరిగివస్తున్న సందర్భంలో ఇంట్లో పిల్లవాడికి నలతగా ఉందని ఆసుపత్రికి తీసుకోని వెళ్లేందుకు త్వరగా రావాలని తన భార్య చేసిన ఫోన్ రిసీవ్ చేసుకున్న జమీర్ వెంటనే వస్తున్నానని కూడా చెప్పారు .అదే ఆయన కుటుంబంతో మాట్లాడిన చివరి మాట …. తిరిగివస్తున్న జమీర్ వాహనం రాయికల్ మండలం రామోజీ పేట వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో కొట్టుకొని పోయింది. అందులో ఉన్న జమీర్ స్నేహితుడు విషాద్ కిందకు దూకి ప్రాణాలను కాపాడుకోగా , జమీర్ అందులోనే చిక్కుకున్నాడు …కారు వరద ఉధృతికి కొట్టుకొని పోయింది .మూడు రోజులుగా వరదల్లో గాలించిన అనంతరం శుక్రవారం ఉదయం వరద ప్రవాహం తగ్గటంతో కారు ను గుర్తించి వెలికి తీశారు . అందులో జమీర్ ఆనవాళ్లు లేకపోవడంతో ఆయనకూడా తప్పించుకొని ఉంటారని భావించారు . ఎక్కడో ఒక ఆశ… కారులో లేకపోయేసరికి బతికి ఉంటాడని …ఉంటె బాగుండు తిరిగి రావాలని కోరుకున్న కుటుంబసభ్యులకు స్నేహితులకు అక్కడే కొద్దీ దూరంలో చెట్ల పొదల్లో జమీర్ మృతదేహం చిక్కుకొని కనిపించటంతో వారి హృదయాలు బద్దలైయ్యాయి… కన్నీరు మున్నీరుగా విలపించారు …. కూలీల వార్తలను కవర్ చేయడానికి వెళ్లి కారుతో సహా కొట్టకుపోయిన జగిత్యాల జిల్లాకుచెందిన జమీర్ మృతి చెందారని అధికారులు సైతం బరువెక్కిన హృదయంతో వెల్లడించారు .

జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది..మంత్రి కేటీఆర్

వార్త కవరేజ్ కు వెళ్లి వాగు వరదలో కొట్టుకొని పోయిన జగిత్యాల జర్నలిస్ట్ ఎన్టీవీ ప్రతినిధి జమీర్ మృతి బాధాకరమని ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు . ఆయన మృతికి సంతాపాన్ని ప్రకటించారు . కుటుంబానికి సానుభూతి ప్రకటించారు .

జర్నలిస్ట్ సంఘ నేతల సంతాపం ….

జగిత్యాల ఎన్టీవీ జర్నలిస్ట్ జమీర్ మృతిపట్ల ఐ జె యూ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి , ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ , టి యూ డబ్ల్యూ జె (ఐ జె యూ ) రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు నగునూరి శేఖర్ ,విరహత్ అలీ తీవ్ర సంతాపం ప్రకటించారు . వార్త కవరేజ్ కు వెళ్లిన జమీర్ మరణం విషాదకరమని ఆయన కుటుంబాన్ని రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని , ఎన్టీవీ యాజమాన్యం కూడా ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు .

Related posts

బ్రిజభూషణ్ నిందితుడే …విచారణ నివేదికలో ఢిల్లీ పోలిసుల

Ram Narayana

ఉప్పల్ టీఆర్ యస్ ఎమ్మెల్యేపై భూకబ్జా ఆరోపణలు … ఖండించిన ఎమ్మెల్యే…

Drukpadam

తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు.. నేడు కోర్టుకు….

Drukpadam

Leave a Comment