Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇంగ్లండ్‌లో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఎమర్జెన్సీ ప్రకటన!

ఇంగ్లండ్‌లో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఎమర్జెన్సీ ప్రకటన!
-ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడం ప్రమాద సంకేతమన్న వాతావరణశాఖ
-ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యం బారినపడే అవకాశం ఉందంటున్న అధికారులు
-అత్యవసర పనులను సైతం వాయిదా వేసుకోవాలని సూచన
-మరణాలు కూడా సంభవించే అవకాశం ఉందని హెచ్చరిక

ఇంగ్లాండ్లో ఒకపక్క రాజకీయ వాతావరణం వేడెక్కుతుండగా మరోపక్క ఎండలు వీటిని మరింతగా పెంచుతున్నాయి. దీంతో అటు రాజకీయ వర్గాలు ఇటు ప్రజలు రాజకీయ వేడి ,ప్రక్రుతి హీట్ తో సతమౌతున్నారు . బ్రిటన్ ప్రధాని గా ఉన్న బోరిస్ జూన్సన్ రాజీనామాల తర్వాత అక్కడ రాజకీయాల్లో ఒక్కసారిగా రాజకీయాలు హీట్ ను పెంచాయి . దీంతో ఒకపక్క రాజకీయ వేడి మరోపక్క ప్రకృతి విలయతాండవం చేయటంతోఇటు ప్రజలు అటు రాజకీయనాయకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు

ఇంగ్లండ్‌లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఎన్నడూ లేనంతగా వడగాలులు వీస్తుండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. దేశ చరిత్రలోనే తొలిసారి ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణశాఖ అప్రమత్తమైంది. దేశంలో తొలిసారి ఎండల కారణంగా ‘రెడ్‌ వార్నింగ్’ జారీ చేసింది. లండన్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కొన్ని వారాలపాటు భానుడి ప్రతాపం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయని, ఇది ప్రమాద సంకేతమని బ్రిటన్ వాతావరణ విభాగం తెలిపింది. ఊహించని వాతావరణ మార్పులు ప్రజారోగ్యానికి ప్రమాదమని పేర్కొంటూ ‘అత్యయిక స్థితి’ని ప్రకటించింది. ప్రజలు ఎండలకు దూరంగా ఉండాలని, ప్రజలు ఈ హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోవాలని సూచించింది. వీలైనంత వరకు బయటకు రాకుండా చూసుకోవాలని, అత్యవసర పనులను సైతం వీలైతే వాయిదా వేసుకోవాలని పేర్కొంది.

అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్, నీటి సరఫరా, మొబైల్ ఫోన్ సేవల్లో అంతరాయం ఏర్పడ వచ్చని తెలిపింది. మరోవైపు, బ్రిటన్ హెల్త్ ఏజెన్సీ కూడా అత్యంత తీవ్రమైన నాలుగో అలర్ట్‌ను ప్రకటించింది. తాజా పరిస్థితుల వల్ల ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యం బారినపడే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు, ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చని హెచ్చరించింది.

 

Related posts

ముఖ్యమంత్రి కేసీఆర్ చిక్కుల్లో ఇరుక్కున్నాడు …?

Drukpadam

తెలుగు రాష్ట్రాలలో ఉపఎన్నికలలో నోటిఫికేషన్ విడుదల

Drukpadam

రైతులకు కేంద్రం మీటర్ …రాష్ట్రం వాటర్: మంత్రి అజయ్ …

Drukpadam

Leave a Comment