హర్యానాలో డిఎస్పీ ని హత్య చేసిన మైనింగ్ మాఫియా …
-మరో ఇద్దరు పోలీసులకు తప్పిన ప్రమాదం
-ట్రక్కుతో తొక్కించి హత్య చేసిన వైనం
-ప్రరారీలో ట్రక్కు డ్రైవర్ …
-గాలిస్తున్న పోలీసులు
అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసు ఉన్నతాధికారి (డీఎస్పీ)పై మైనింగ్ మాఫియా ట్రక్కును ఎక్కించి చంపేశారు. ఈ దారుణ సంఘటన హరియాణాలో జరిగింది. విషయం తెలుసుకున్న హర్యానా ప్రభుత్వ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. దోషులు ఎంతటివారైనా వదిలేప్రసక్తి లేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది . పోలీసులకే రక్షణ లేనప్పుడు ప్రజలకు ఎలా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇదే పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం వల్లనే డిఎస్పీ హత్యకు గురైయ్యారని ప్రతిపక్షను ఆరోపిస్తున్నాయి.
హరియాణాలోని పచగావ్‌కు సమీపంలో అక్రమంగా రాయి తవ్వకాలు కొనసాగుతున్నట్లు గతకొన్ని రోజులుగా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో తావ్‌డూకు చెందిన డీఎస్‌పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్.. తన బృందంతో కలిసి తవ్వకాలు జరుగుతోన్న ప్రాంతానికి చేరుకున్నారు. వీరిని చూసిన వెంటనే అక్రమ మైనింగ్ నిర్వహిస్తోన్న వారంతా అక్కడనుంచి పారిపోవడం మొదలుపెట్టారు. అదే సమయంలో రాళ్లను తరలిస్తోన్న ట్రక్కును ఆపాలని డీఎస్‌పీ ఆదేశించారు. అయినప్పటికీ పట్టించుకోని ట్రక్ డ్రైవర్.. పోలీస్ అధికారిపైకి వాహనాన్ని ఎక్కించారు. ఈ దాడిలో డీఎస్‌పీ సురేంద్ర సింగ్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు పోలీసులు ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. దాడి చేసిన వెంటనే నిందితుడు అక్కడ నుంచి పారిపోగా.. అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.