Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తలకు మించిన అప్పులతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది : ఐఎంఎఫ్ చీఫ్!

తలకు మించిన అప్పులతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది : ఐఎంఎఫ్ చీఫ్!
-ఆర్థిక సంక్షోభం… మిగతా దేశాలకు హెచ్చరిక వంటిది
-శ్రీలంకలో కల్లోల భరిత పరిస్థితులు
– మితిమీరిన రుణభారమే కారణమన్న క్రిస్టలీనా జార్జియేవా
– కొన్ని దేశాల పరిస్థితి ఇలాగే ఉందని వెల్లడి
– తాము గతంలోనే హెచ్చరించామని స్పష్టీకరణ

శ్రీలంకలో ఏర్పడిన దారుణ పరిస్థితులపై అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలీనా జార్జియేవా స్పందించారు. తలకు మించిన అప్పులు శ్రీలంకను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేశాయని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది అన్నారు . మిగతా దేశాలకు ఇది కనువిప్పు కావాలని పేర్కొన్నారు. మితిమీరిన రుణభారం ఎదుర్కొంటున్న దేశాలు శ్రీలంక తరహా పరిస్థితులే చవిచూస్తాయని హెచ్చరించారు. ఇది ఏ దేశానికి మినహాయింపు కాదని తెలుసుకోవాలని వార్న్ చేశారు .

“బాలి ద్వీపంపై నిర్మలంగా కనిపించే ఆకాశంలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెలిగిపోతుందని భావించాం. కానీ వాస్తవానికి అలా జరగలేదు. సమస్యల అంధకారం నెలకొంది. అనిశ్చితి కట్టలు తెంచుకుంది. పరిమితికి మించి అప్పులు చేస్తే క్షేత్రస్థాయిలో ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయని గతంలో మేం హెచ్చరించామో, ఇవాళ అవన్నీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. అధిక రుణభారం ఎదుర్కొంటున్న దేశాలు, విధానపరమైన సిద్ధాంతాల అమలుకు తగిన వెసులుబాటు లేని దేశాలకు అదనపు చిక్కులు తప్పవు. ఆయా దేశాల పరిస్థితి శ్రీలంక కంటే భిన్నంగా ఏమీ ఉండదు” అని క్రిస్టలీనా జార్జియేవా స్పష్టం చేశారు.

ఆమె ఇండోనేషియాలో జరిగిన జీ20 దేశాల ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

Related posts

భార్యతో విడాకులు మంజూరు చేయాలని ఒమర్ అబ్దుల్లా పిటిషన్.. హైకోర్టు కీలక తీర్పు

Ram Narayana

మహిళలను కొరడాలతో కొట్టి.. షరియా చట్టాన్ని అమలు చేసిన తాలిబన్లు!

Drukpadam

హైకోర్టుకు క్షమాపణ చెప్పిన ఖమ్మంజిల్లా కలెక్టర్ కర్ణన్

Drukpadam

Leave a Comment