Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

భద్రాచలం ముంపు పాపం బీజేపీదే: మంత్రి అజయ్..మంత్రి అజయ్ !

భద్రాచలం ముంపు పాపం బీజేపీదే: మంత్రి అజయ్..మంత్రి  అజయ్  !
-5 విలీన గ్రామాలు తెలంగాణకు తిరిగివ్వాలి
-ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలి
-2014 లోనే కేంద్రం అన్యాయాన్ని సీఎం కేసిఆర్ ఎండగట్టారు.

పోలవరం ముంపు పాపం బీజేపీదేనని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధ్వజమెత్తారు .చేసినపాపాన్ని కడుక్కోవాల్సిందే కూడా బీజేపీనేనని అందువల్ల చేసిన తప్పును సరిదిద్దుకునేనుకు ఇంకా వారికీ అవకాశం ఉందని అందువల్ల ఐదు విలీన గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇచ్చేవిధంగా పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలని మంత్రి డిమాండ్ చేశారు .

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణలోని లక్షలాది మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సరైన అధ్యయనం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కేంద్రాన్ని కోరారు. గురువారం నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.

1986 లో ఇంతకంటే ఎక్కువ వరద వచ్చిందని అప్పుడు 75.9 అడుగుల వరద వచ్చినా ఇంత ముంపు లేదని కానీ ప్రస్తుతం 71.4 అడుగుల వరద వస్తేనే ముంపు అధికంగా ఉందన్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు 35 లక్షల క్యూసెక్కులకు సరిపడా నిర్మిస్తున్నారని భవిష్యత్ లో 50 లక్షల క్యూసెక్కులకు నిర్మిస్తే భద్రాచలం పరిస్థితిని ఏమిటని మంత్రి అజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.

పోలవరం ను మూడు కొండల మధ్య నిర్మాణం చేస్తున్నారని ఐతే ఒక వైపు కాంక్రీట్ డ్యామ్ మరో వైపు కాపర్ డ్యామ్ ను నిర్మిస్తున్నారని ప్రస్తుతం వరద ఎక్కువ ఉండటం వల్ల రెండువైపులా కాపర్ డ్యాంపై నిండుగా వరద పోతుందని అన్నారు. భవిష్యత్తులో కాపర్ డ్యామ్ ఉన్నచోట కాంక్రీట్ డామ్ నిర్మిస్తే భద్రాచలం మొత్తం మునగడం ఖాయమన్నారు. ఈ విషయంలో సిడబ్ల్యూసీ జోక్యం చేసుకోవాలని పోలవరం బ్యాక్ వాటర్ అధ్యయనం కోసం కేంద్ర జల సంఘం నిపుణుల కమిటీ వేయాలని మంత్రి పువ్వాడ డిమాండ్ చేశారు.

అదేవిధంగా పోలవరంతో భద్రాచలానికి ముంపు ఉందని వరద ముప్పు నుంచి శాశ్వతంగా తప్పించడానికి అవసరమే నిర్మాణాలు చేపట్టడం కోసం భద్రాచలం పట్టణం చుట్టూ ఉన్నాయి గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని మంత్రి పువ్వాడ కోరారు దీనికి సంబంధించిన బిల్లును ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే పార్లమెంట్లో పెట్టాలని మంత్రి పువ్వాడ కేంద్రాన్ని కోరారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

భద్రాచలం ఆలయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఐదు గ్రామాలు తిరిగి తెలంగాణకు ఇవ్వాలని ఆయా గ్రామాల ప్రజలు కూడా తెలంగాణలో ఉండేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఏడు మండలాలు, ఆంధ్రలో కలపాలని 2014లో కేంద్రం తీర్మానించిందని తదనుగుణగా ఆర్డినెన్సు జారీ చేసిందన్నారు. దీనికి వ్యతిరేకంగా భద్రాచలం ముంపుకు గురవుతుందని ఆదివాసీలకు నష్టమని ఇది రాజ్యాంగానికి విరుద్ధమని సీఎం కేసిఆర్ రాయడమే కాకుండా తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారని మంత్రి గుర్తు చేశారు.

వరదలు వస్తున్న సమయంలో దాదాపు 400 కిలోమీటర్లు దూరం రోడ్డు మార్గంలో పయనించి ప్రజలకు, ఉద్యోగులకు ధైర్యం చెప్పిన ఏకైక సీఎం కేసీఆర్ అని మంత్రి అన్నారు. వర్షంలో వచ్చి ముంపు ప్రాంతాలలో పర్యటించారని వరదల శాశ్వత పరిష్కారానికి సీఎం కేసీఆర్ 1000 కోట్లు ప్రకటించారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగం మొత్తం ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేస్తున్నారని తెలిపారు.

వరద బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి 20 కేజీల బియ్యం, 5 కేజీల కందిపప్పు ఒక్కొక్క కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తున్నామని అన్నారు. బాధితులకు చెందిన బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రజలకు బాధితులకు సేవకు అందిస్తున్నారని మంత్రి అన్నారు

Related posts

విజయమ్మ కోపంలో చేయి విసిరారు… ఆ దెబ్బకు ఈగైనా చస్తుందా?: షర్మిల

Drukpadam

కరోనా వ్యాక్సిన్ అందించటంలో కేంద్రం విఫలం : బెంగాల్ సీఎం మమత…

Drukpadam

ఇది కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్ర‌జ‌లు సాధించిన విజయం: ఈట‌ల రాజేంద‌ర్

Drukpadam

Leave a Comment