Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

షిండే సీఎం కావడంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ చీఫ్!

షిండే సీఎం కావడంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర బీజేపీ చీఫ్!

  • ఫడ్నవిస్ కు బదులుగా షిండేను సీఎం చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది
  • బరువైన గుండెతో అధిష్ఠానం నిర్ణయాన్ని అంగీకరించాం
  • ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర నేతలంతా బాధపడ్డాం

మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే
ఆధ్వరంలో ఉన్న ఐక్యం సంఘటన ప్రభుత్వాన్ని పడగొట్టి శివసేన కు చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేల సహకారంతో షిండే నేతృత్వంలో బీజేపీ సహకారం తో ప్రభుత్వం ఏర్పడింది . బిజెపి సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే మహారాష్ట్రకు చెందిన బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. షిండేను ముఖ్యమంత్రిగా తమ పార్టీ అధిష్టానం అంగీకరించడం తమకు ఆశ్చర్యం కలిగించిందని ఆయన చెప్పారు. తమ గుండెలన్నీ బరువెక్కాయి .అయినప్పటికీ పార్టీ నిర్ణయాన్ని కాదనలేక చేసేది లేక షిండేను సీఎంగా ఒప్పుకున్నామని ఆయన అన్నారు. ఫడ్నవిస్ ను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించడం కూడా తమకు ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నారు. ఈ విషయంలో అధిష్టానం చెప్పినట్లు చేయటం మినహా తమకు మరో మార్గం కనిపించలేదని ఆయన వాపోయారు.మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే షిండే ప్రభుత్వం మరి కొద్ది కాలం మాత్రమే ఉంటుందని చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఈవిధంగా మాట్లాడటం ఆసక్తిగా మారింది.

 

బీజేపీ అండతో శివసేన రెబెల్ నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించారు. ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఫడ్నవిస్ ని డిప్యూటీ సీఎంని చేయడం చాలా మందికి మింగుడుపడలేదు. తాజాగా ఈ అంశానికి సంబంధించి మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ… ఫడ్నవిస్ కు బదులుగా షిండేను సీఎంగా చేయాలని బరువైన గుండెతో పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. షిండేకు ముఖ్యమంత్రి పగ్గాలను అప్పగించడంపై తాము ఎంతో బాధపడ్డామని తెలిపారు. మరో ఆప్షన్ లేకపోవడంతో… అధిష్ఠానం నిర్ణయాన్ని అంగీకరించామని చెప్పారు. ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర బీజేపీ నేతలందరం కలత చెందామని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

మరోవైపు నిన్న ఓ కార్యక్రమంలో ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ… షిండే సర్కార్ ఎక్కువ కాలం కొనసాగదని చెప్పారు. థాకరే ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే పాటిల్ పైవ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Maharashtra BJP chief sensational comments on Shinday becoming CM

Related posts

ప్రియాంక నిరుద్యోగుల నిరసన సభపై కాంగ్రెస్ గంపెడు ఆశలు…

Drukpadam

ఇంతకీ ఈటల బీజేపీలో చేరుతున్నట్లా? లేదా ?

Drukpadam

కెన్యాలో దారుణం.. మతపెద్ద సూచనతో కఠిన ఉపవాసం చేసి 47 మంది మృతి!

Drukpadam

Leave a Comment