Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బండి పాదయాత్ర కు హైకోర్టు పచ్చజెండా…

బండి పాదయాత్ర కు హైకోర్టు పచ్చజెండా…
బండి సంజయ్ పాదయాత్ర పునఃప్రారంభం
హైకోర్టు గ్రీన్ సిగ్నల్ తో పాదయాత్ర ప్రారంభం
రేపు ఉదయం ముగియనున్న పాదయాత్ర
ఇప్పటికే ముగిసిన రెండు విడతల పాదయాత్రలు

అనేక ఆటంకాల మధ్య పరస్పర విమర్శలు ప్రతివిమర్శలు మధ్య సాగుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు పర్మిషన్ నిరాకరించడంతో ఆయన హైకోర్టు ను ఆశ్రయించి పర్మిషన్ తెచ్చుకున్నారు రేపు వరంగల్ భద్రకాళి దేవాలయం వద్ద మూడవ విడత యాత్ర ముగించాలని నిర్ణయించారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో బహిరంగ సభకు కూడా ప్లాన్ చేసుకున్నారు . అయితే ముందుగా అనుమతి నిచ్చిన కాలేజీ ప్రిన్సిపాల్ పోలిసుల పర్మిషన్ లేదంటూ అనుమతి నిరాకరించారు . పాదయాత్ర నిరాకరణ , బహిరంగ సభకు అనుమతి ఇవ్వకపోవడంపై బీజేపీ హైకోర్టు ను ఆశ్రయించింది. దీంతో హైకోర్టు పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. బండి సంజయ్ పాదయాత్ర మళ్లీ ప్రారంభమయింది. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి లేదంటూ వరంగల్ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర మళ్లీ ప్రారంభమయింది. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి లేదంటూ వరంగల్ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై నిన్న విచారణ జరిపిన హైకోర్టు బండి సంజయ్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో, ఈరోజు ఆయన పాదయాత్ర పునఃప్రారంభమయింది. ఈ రోజు ఉప్పుగల్, కూనూరు, గర్మెపల్లి, నాగాపురంలో ఆయన ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది.

మరోవైపు హైకోర్టు తీర్పు నేపథ్యంలో పాదయాత్రను ప్రారంభించే చోటుకు నిన్న రాత్రే ఆయన చేరుకున్నారు. రేపు ఉదయం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ఆయన పాదయాత్ర ముగియనుంది. ఈ నెల 2న ఆయన పాదయాత్ర ప్రారంభమయింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాదయాత్రను ప్రారంభించారు. ఇప్పటికే రెండు విడతల పాదయాత్రలు ముగిశాయి. రేపటితో మూడో విడత పాదయాత్ర ముగియనుంది.

Related posts

శభాష్ భట్టి …శాసనసభలో వివిధ సమస్యలను ప్రస్తావించినతీరు అద్భుతం!

Drukpadam

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట :సజ్జల రామకృష్ణారెడ్డి…

Drukpadam

గజ్వేల్ లో కేసీఆర్ ఓటమి ఖాయం…..రేవంత్ రెడ్డి

Drukpadam

Leave a Comment