కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు షడ్యూల్ విడుదల -అక్టోబర్ 17 ఎన్నిక…
సిడబ్ల్యూసి వర్చువల్ మీటింగ్ లో నిర్ణయం
సెప్టెంబర్ 24 నుంచి 31 నామినేషన్లు
అక్టోబర్ 1 పరిశీలన –7 న విత్ డ్రాయల్
నేడు ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం
సెప్టెంబరు 22న నోటిఫికేషన్
సెప్టెంబరు 7 నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర
తెలుగు రాష్ట్రాలకు సమన్వయకర్తల నియామకం
చాల సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్ష పదవికి ఎన్నిక జరపాలని నిర్ణయించడం ఆశక్తిగా మారింది.ఏకగ్రీవం కాకపోతే అక్టోబర్ 17 న ఎన్నిక జరపాలని ఆదివారం వర్చువల్ గా జరిగిన సిడబ్ల్యూసి మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు . ఈ మేరకు ఎన్నికల షడ్యూల్ కూడా ప్రకటించారు . సెప్టెంబర్ 22 న ఎన్నికల షడ్యూల్ విడుదల చేస్తారు . 24 నుంచి 31 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు . అక్టోబర్ 1 న పరిశీలన జరుగుతుంది.అక్టోబర్ 7 న విత్ డ్రాయల్ కు అవకాశం కల్పించారు .
గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కి అనేకమంది సీనియర్ నేతలు గుడ్ బై చెప్పారు . అయితే వారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి అవి లేకపోయేసరికి బయటకు పోవడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి.
ఢిల్లీలో నేడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేశారు. అక్టోబరు 17న కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికలకు సెప్టెంబరు 22న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
కాగా, సీడబ్ల్యూసీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వర్చువల్ గా హాజరయ్యారు. సోనియా వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లగా, ఆమె వెంట రాహుల్, ప్రియాంక కూడా వెళ్లారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యాలు చవిచూడడంతో ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అప్పటి నుంచి సోనియానే తాత్కాలిక ప్రాతిపదికన పార్టీ నాయకత్వ బాధ్యతల్లో కొనసాగుతున్నారు.
భారత్ జోడో యాత్రకు తెలుగు రాష్ట్రాల సమన్వయకర్తలు వీరే…
త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడుతున్నారు. సెప్టెంబరు 7న ప్రారంభమయ్యే ఈ యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగనుంది. కాగా, ఈ భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాల గుండా సాగుతుంది. ఈ నేపథ్యంలో, భారత్ జోడో యాత్రకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలను నియమించింది. ఏపీకి డాలీ శర్మ, తెలంగాణకు ఎస్వీ రమణ సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు.