Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రసవత్తరంగా ఖమ్మం జిల్లా టీఆర్ యస్ రాజకీయాలు..గ్రూప్ లతో తలనొప్పులు!

రసవత్తరంగా ఖమ్మం జిల్లా టీఆర్ యస్ రాజకీయాలు..గ్రూప్ లతో తలనొప్పులు!
-జిల్లాలో అధికార ,ప్రతిపక్షాల దోస్తీ ఆశక్తికర చర్చ
-అధికార పార్టీ పంచన చేరుతున్న ప్రతిపక్షాలు
-జిల్లాలకు అధ్యక్షులను నియమించినా …కమిటీలు లేవు
-క్యాడర్ లో అసంతృప్తి …
-ఎన్నికలనాటికి పార్టీలో గ్రూప్ ల తగాదాలు మరింత పెరిగే అవకాశం

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.గ్రూప్ రాజకీయాలతో తలనొప్పులు తయారైయ్యాయి. పార్టీ అంట ఐక్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఎవరి రాజకీయాలు వారివి . అందరు పెద్ద నాయకులే …వారిలో ఖమ్మం ఎంపీ ,లోకసభ లో టీఆర్ యస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ,లతోపాటు తాజామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నారు . రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవి చంద్ర , సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు , కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు , ఎమ్మెల్సీ టీఆర్ యస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాతా మధు లాంటి పేరుమోసిన నేతలు ఉన్నారు . అయితే వీరి మధ్య ఐక్యత అంతంత మాత్రమే …. ఎప్పుడు ఎవరు ఏ గ్రూప్ లో ఉంటారు .ఏ పార్టీలో ఉంటారు… ఎవరు ఎటు పోతారనేది తెలియని పరిస్థితి నెలకొంది…

అసలు జిల్లాలో అధికార పక్షం… ప్రతిపక్షం అనే తేడా లేకుండా పరస్పర సహకారంతో తమ వ్యక్తిగత ప్రజా ప్రయోజనాల కోసం కలిసి ప్రయాణం సాగించడం ఈ జిల్లాలో ఉన్న ప్రత్యేకత. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన వారు అధికార పార్టీ పంచన చేరి తమ ప్రయోజనాలు కాపాడుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలకు సైతం అంతుబట్టని చిదంబర రహస్యం గా పార్టీ కార్యకలాపాలు సాగుతున్నాయి .టీఆర్ యస్ జిల్లా కమిటీ లను నియమిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ వాటిని ఏర్పాటు చేయరు . పోనీ జిల్లాలో మంత్రికి అన్ని రకాల అధికారాలు ఇస్తున్నట్లు చెప్పినప్పటికీ అవి అమలు కావు. జిల్లాలో పార్టీ కమిటీలు ఎప్పుడు నియమిస్తారో అర్ధం కానీ పరిస్థితి .దీంతో క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు . కేవలం జిల్లా అధ్యక్షులను మాత్రమే నియమించి మిగతా కమిటీ జోలికి పోకుండా ఉండటం టిఆర్ఎస్ ప్రత్యేకత అనే అభిప్రాయాలు ఉన్నాయి. పార్టీ ప్రారంభంలో జిల్లా కమిటీలను నియమించిన టీఆర్ యస్ రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి జోలికి వెళ్ళలేదు. పైగా తమకు రాష్ట్ర ,మండల కమిటీలు మాత్రమే ఉన్నాయని జిల్లా కమిటీ లు లేవని చెప్పింది. జిల్లా కమిటీలు నియమించేది లేదని చెప్పిన టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలను మండల కమిటీలు మాత్రమే నియమించింది . తర్వాత కాలంలో జిల్లా కమిటీలు నియమిస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత జిల్లా కమిటీ లను ప్రకటించి కేవలం అధ్యక్షులు మాత్రమే నియమించి కమిటీ ప్రకటించకపోవడంతో టీఆర్ యస్ లో అసంతృప్తి నెలకొన్నది .పదవులమీద ఆశలు పెట్టుకున్ననేతలు పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు .

Related posts

చ‌ల‌మ‌ల కృష్ణారెడ్డితో క‌లిసి రేవంత్‌తో భేటీ అయిన పాల్వాయి స్ర‌వంతి!

Drukpadam

‘తాలిబన్​’ పదాన్ని తొలగించిన ఐరాస భద్రతా మండలి….

Drukpadam

దేశరాజధాని ఢిల్లీలో బీఆర్ యస్ హడావుడి …

Drukpadam

Leave a Comment