Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మహారాష్ట్రలో రాజకీయ దుమారం …సీఎం షిండే కుర్చీలో కూర్చున్న తనయుడు …

మహారాష్ట్రలో రాజకీయ దుమారం.. సీఎం ఏక్‌నాథ్ షిండే కుర్చీలో కూర్చున్న తనయుడు

  • సీఎం కుమారుడి చేతిలో ఫైల్
  • ‘సూపర్ సీఎం’ అని విమర్శిస్తున్న విపక్షాలు
  • విమర్శలపై స్పందించిన శ్రీకాంత్ షిండే
  • అది సీఎం అధికారిక నివాసం కాదని స్పష్టీకరణ

సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్న ఫొటో ఒకటి మహారాష్ట్రలో రాజకీయ దుమారానికి కారణమైంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే సీఎం కుర్చీలో కూర్చున్న ఫొటో ఇది. ఆ గదిలో ప్రభుత్వాధికారులు నిల్చుని ఉన్నారు. అంతేకాదు, ఆయన చేతిలో ఓ ఫైల్ ఉండడం ఈ మొత్తం దుమారానికి కారణమైంది. ఈ ఫొటో వెలుగులోకి రావడంతో విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ‘సూపర్ సీఎం’ అని విమర్శిస్తున్నాయి.

ఈ విమర్శలపై శ్రీకాంత్ షిండే స్పందించారు. ముఖ్యమంత్రి రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేస్తున్నారని అన్నారు. ఆయన చాలా సమర్థుడైన సీఎం అని, ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో థానే నివాసంలోనిదని, అది ముఖ్యమంత్రి అధికారిక నివాసం కాదని వివరణ ఇచ్చారు. సీఎంతోపాటు తాను కూడా దానిని ఉపయోగించుకుంటూ ఉంటానని శ్రీకాంత్ స్పష్టం చేశారు.

Related posts

సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తాం…బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు!

Drukpadam

జ‌గ‌న్‌పై బ్ర‌ద‌ర్ అనిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Drukpadam

ఎన్టీఆర్ అభిమానిగా కేసీఆర్ …అరుదైన ఫోటో !

Drukpadam

Leave a Comment