హన్మకొండలో సీఎం కేసీఆర్ కు వీఆర్ ఏ ల నిరసన సెగ …
-వీఆర్ఏలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం..వినతిపత్రాన్ని విసిరిపారేసిన వైనం
-ఏమి డ్రామాలాడుతున్నారా అంటూ సంఘనాయకులపై ఫైర్
-కెప్టెన్ లక్ష్మి కాంతారావు ఇంటి దగ్గర ఘటన
-అవాక్కయిన వీఆర్ ఏ సంఘ నేతలు
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నడూ లేనిది నేడు తమ సమస్యల పరిస్కారం కోసం గత 69 రోజులుగా దీక్షలు చేస్తున్న వీఆర్‌ఏ సంఘం నేతలపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు . ఏమి డ్రామాలు ఆడుతున్నారా ? అంటూ ఒకింత కఠినంగా ఆగ్రహం ప్రకటించారు. దీంతో సీఎం కు తమ సమస్యలు విన్నవిస్తే ఫలితం ఉంటుందని అక్కడకు వచ్చిన సంఘ నాయకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు . మొత్తానికి సీఎం చాల రోజులతర్వాత ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. శనివారం రోజున కేసీఆర్ వరంగల్ లో పర్యటించారు. ఆయన హైద్రాబాద్ నుంచి రోడ్ మార్గంలో వరంగల్ కు చేరుకున్నారు . దారిలో జనగాం దగ్గర వీఆర్ఏలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వీఆర్ఏల ఆందోళనలతో సీఎం కేసీఆర్ కాన్వాయ్ దిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కానీ ఇదే రోజు హన్మకొండలో మరోవిధంగా వ్యవరించడంతో చర్చనీయాంశంగా మారింది. ..
వీఆర్‌ఏ సంఘం నేతలపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హామీలు నెరవేర్చాలని వారు సీఎం కేసీఆర్ కి వినతి పత్రం అందించగా..వీఆర్‌ఏల ఫిర్యాదును కోపంతో వారిపైకే కేసీఆర్ విసిరివేశారు. డ్రామాలాడుతున్నారంటూ వీఆర్‌ఏ సంఘం నేతలపై సీఎం ఫైర్ అయ్యారు. మాజీ ఎంపీ, టీఆర్ఎస్ సీనియర్ నేత అయిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి కేసీఆర్ వెళ్లిన నేపథ్యంలో ఆయన్ని వీఆర్‌ఏ సంఘం నాయకులు కలిసినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ పరిణామంతో వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇదిలా వుండగా అంతకుముందు జనగామ వద్ద సీఎం కేసీఆర్‌కు నిరసన సెగ తగిలింది. . ముఖ్యమంత్రి కాన్వాయ్ ముందు వీఆర్ఏలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. వీఆర్ఏల ఆందోళనలతో సీఎం కేసీఆర్ కాన్వాయ్ దిగి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే హనుమకొండలో మాత్రం వారిపై కేసీఆర్ ఈ విధంగా స్పందించడం విఆర్ఏలను విస్మయానికి గురిచేసింది.