Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నిపుణులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్న కెనడా

  • కార్మికులు, నిపుణుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కెనడా
  • 2025 నాటికి ఏటా 5 లక్షల మంది రావచ్చని అంచనా
  • గతేడాది 4 లక్షల మందికి శాశ్వత నివాస హోదా

కెనడా అనేది ఉత్తర అమెరికా ఖండంలోని ఒక చిన్నదేశం గ్లోబ్ కు ఉత్తర భాతంలో ఉండే ఈ దేశంలో సంవత్సర కాలంలో సుమారు 9 నెలలు మంచు ,వర్షాలతో అత్యంత చలిగా ఉంటుంది. అయినప్పటికీ ఈదేశంలో క్రైమ్ రేట్ తక్కువనే చెప్పాలి . ఇప్పటికే సుమారు 4 కోట్ల జనాభా కలిగి ఉన్న కెనడా రాజధాని ఓట్టవా …వాణిజ్య రాజధాని టొరంటో … ఇప్పటికే ప్రపంచంలోని అనేక దేశాలనుంచి వచ్చిన వారే అధికంగా ఉంటారు . వివిధ జాతులు మతాలు సంస్కృత సంప్రదాయాలు , ఉండటం ఆదేశ ప్రత్యేకత … జనాభా పెరుగుతుంది. అనేక సాఫ్ట్ వెర్ కంపెనీలు ఉండటంతో భారత్ తో పాటు అనేక దేశాలనుంచి వచ్చి స్థిరపడినవారు ఉండటం అక్కడే పౌరసత్వం తీసుకోవడం చూస్తున్నాం . అక్కడికి వస్తున్నవారికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలనేది ఆదేశం ఉద్దేశం …కానీ అందుకు అనుగుణంగా మ్యాన్ పవర్ లేదు . అందువల్ల ఎక్కువగా ఇతర దేశాలనుంచి నిపుణులైన వారిని రమ్మని కెనడా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. 

నిపుణులు, కార్మికుల కొరతను కెనడా పెద్ద ఎత్తున ఎదుర్కొంటోంది. 2025 నాటికి ఏటా 5 లక్షల మంది తమ దేశానికి వలస రావచ్చన్న ప్రణాళికతో ఉంది. వలసదారుల వ్యవహారాల మంత్రి సియాన్ ఫ్రేజర్ ఇందుకు సంబంధించి నూతన ప్రణాళికను విడుదల చేశారు. తగినంత అనుభవం, నైపుణ్యాలు ఉన్న వారికి శాశ్వత నివాస హోదా ఇవ్వనుంది. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ సైతం ఈ ప్రణాళికను స్వాగతించింది.

దీన్ని అతిపెద్ద వలసవాదంగా కెనడా మంత్రి ఫ్రేజర్ వ్యాఖ్యానించారు. 2023లో వివిధ దేశాల నుంచి 4,65,000 మంది వస్తారని, 2025 నాటికి ఇలా వచ్చే వారి సంఖ్య 5,00,000కు చేరుకుంటుందని కెనడా అంచనా వేస్తోంది. గతేడాది 4,05,000 మందికి కెనడా శాశ్వత నివాస హోదా ఇచ్చింది. 

Related posts

ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో షేక్ సాబ్జీ విజయం

Drukpadam

విజయనగరం రైలు ప్రమాదంలో 14కు పెరిగిన మృతుల సంఖ్య

Ram Narayana

జగిత్యాల , రామగుండంలలో భూ ప్రకంపనలు …ప్రజల్లో ఆందోళన

Drukpadam

Leave a Comment