Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సుప్రీంకోర్టులో అమరావతి పిటిషన్లపై విచారణ మరోమారు వాయిదా!

సుప్రీంకోర్టులో అమరావతి పిటిషన్లపై విచారణ మరోమారు వాయిదా!

  • ఈ నెల 1న సుప్రీంకోర్టులో విచారణకు వచ్చిన అమరావతి పిటిషన్లు
  • నాట్ బిఫోర్ మీ అంటూ వేరే బెంచ్ కు సిఫారసు చేసిన సీజేఐ  
  • శుక్రవారం కోర్టు గడువు ముగుస్తున్నా విచారణకు రాని పిటిషన్లు
  • ధర్మాసనం ముందు అమరావతి రైతుల తరఫు న్యాయవాది ప్రస్తావన
  • ఈ పిటిషన్లపై ఈ నెల 14న విచారణ చేపట్టనున్నట్లు తెలిపిన కోర్టు

ఏపీ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మరోమారు విచారణ వాయిదా పడింది. ఈ నెల 14న అమరావతి పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు శుక్రవారం సుప్రీంకోర్టు తెలిపింది. ఏపీ రాజధాని అమరావతేనని, దానిని నిర్ణీత కాల వ్యవధిలోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ లో తమనూ ఇంప్లీడ్ చేసుకోవాలంటూ అమరావతి రైతులు మరో పిటిషన్ దాఖలు చేశారు. కొందరు వ్యక్తులు కూడా ఈ వ్యవహారంపై పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అన్ని పిటిషన్లను కలిపి ఓకేసారి విచారణ చేపట్టనున్నట్లు గతంలోనే సుప్రీంకోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి ఈ నెల 1న అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే సీజేఐ జస్టిస్ లలిత్… నాట్ బిఫోర్ మీ అంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పిటిషన్లను మరో బెంచ్ కు బదిలీ చేయాలని, ఈ నెల 4న వాటిపై విచారణ చేపట్టాలని కూడా జస్టిస్ లలిత్ ఆదేశాలు జారీ చేశారు.

అయితే ఈ పిటిషన్లు లిస్ట్ అయిన బెంచ్ వద్దకు వెళ్లిన అమరావతి రైతుల తరఫు న్యాయవాది వికాస్ సింగ్… బెంచ్ కార్యకలాపాలు ముగుస్తున్నా తమ పిటిషన్ విచారణకు రాని విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అమరావతి పిటిషన్లపై విచారణను ఈ నెల 14న చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.

Related posts

ఎర్ర చీమల దెబ్బకు ఊరు ఖాళీ చేసిన గ్రామస్థులు..

Drukpadam

అమితాబ్ బచ్చన్‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి!

Drukpadam

కొత్తకోట దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాడె మోసిన చంద్రబాబు!

Drukpadam

Leave a Comment