Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రసమయి తీరు మార్చుకో…టీయూడబ్ల్యూ జె రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ …

రసమయి తీరు మార్చుకో…టీయూడబ్ల్యూ జె రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ …
– ప్రజల ప్రజాస్వామిక ఉద్యమాలకు జర్నలిస్టుల మద్దతు
– గన్నేరువరం వివేకానందుని విగ్రహం వద్ద జర్నలిస్టుల నిరసన
– గన్నేరువరం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీయూడబ్ల్యూ జె (ఐజేయూ )

మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీరు మార్చుకోవాలని లేకపోతె ప్రజలతో కలిసి మరిన్ని ఉద్యమాలు చేయాల్సి ఉంటుందని టీయూడబ్ల్యూ జె రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ హెచ్చరించారు.నియోజకవర్గంలో అభివృద్ధిపై ప్రశ్నిస్తున్న ప్రజలను ,రాస్తున్న పాత్రికేయులను ఆయన అనుయాయులు బెదిరించడంపై ఆగ్రహం ప్రకటించారు. చట్టసభ సభ్యుడిగా ఉండి, రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేయడం, కలాలకు సంకెళ్లు వేసేందుకు ప్రయత్నం చేయడం సిగ్గు చేటని అన్నారు .

ఆయన అనుచరులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని
శేఖర్ ఆరోపించారు.అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రశ్నించే సామాన్య పౌరులను అరెస్టులు చేయించి, కేసులు బనాయించడం నియోజకవర్గంలో పరిపాటిగా మారిందన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని ప్రచురిస్తున్న పాత్రికేయులపై కూడా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అదేవిధానాన్ని అనుసరిస్తున్నారని మండిపడ్డారు. గన్నేరువరం మండల పాత్రికేయుల పట్ల ఎమ్మెల్యే ఆయన అనుచరులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ
గురువారం మండల కేంద్రంలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద
స్థానిక విలేకరులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో నగునూరి శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత్రికేయులుగా, పాత్రికేయ సంఘం నాయకులుగా ప్రజలు చేపట్టే పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

పాత్రికేయులను బెదిరింపులకు గురిచేస్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన వ్యవహార శైలి మార్చుకొని పక్షంలో తాము అదే రీతిన ప్రతిస్పందించాల్సి ఉంటుందన్నారు. ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం, రాజ్యాంగం వారికి కల్పించిన స్వేచ్ఛను ఉపయోగించుకోవటం కోసం గన్నేరువరం ప్రజలు చేపట్టే ప్రజాస్వామిక ఉద్యమాలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

నిరసన ప్రదర్శనలో జర్నలిస్టు సంఘం నాయకులు ఎమ్మెల్యే రసమయికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కలాలతో చెలగాటం ఆడితే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా శాఖ అధ్యక్షుడు తాడూరు కరుణాకర్, కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బల్మూరి విజయసింహారావు, జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎలగందుల రవీందర్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు కొయ్యడ.చంద్రశేఖర్, జిల్లా యూనియన్ సంయుక్త కార్యదర్శి దారం జగన్నాథరెడ్డి, యూనియన్ జిల్లా నాయకులు ఎం మహేంద్ర చారి, గుండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణలో లేకపోతే నాపై రాజద్రోహం కేసు పెట్టేవారేమో: ప్రొఫెసర్ నాగేశ్వర్!

Drukpadam

ప్రతికేసులోనూ అరెస్టు తప్పనిసరి కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

Drukpadam

మెరుగైన కంటిచూపు కోసం.. తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..

Drukpadam

Leave a Comment