Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్ శ్రీనివాసరావు మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి!

ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్ శ్రీనివాసరావు మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి!
-దోషులను వదిలి పెట్టం…కఠినంగా శిక్షలు పడాల్సిందే
-శ్రీనివాస రావు కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియో
-కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
-అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు..
-ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై దాడులు స‌హించ‌బోం

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో బెండాల‌పాడు గ్రామ ప‌రిధిలో గుత్తికోయ‌ల దాడిలో మృతి చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్ శ్రీనివాసరావు మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. శ్రీనివాసరావు కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి ప్ర‌క‌టించారు. శ్రీనివాస‌రావు మృతికి కార‌కులైన దోషుల‌కు క‌ఠినంగా శిక్ష ప‌డేలా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఎఫ్ఆర్‌వో శ్రీనివాస రావు కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం ప్రకటించారు. దాడిలో మరణించిన శ్రీనివాసరావు డ్యూటీలో వుంటే ఏ విధంగానైతే నిబంధనల ప్రకారం జీతభత్యాలు అందుతాయో అవే నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి పూర్తి వేతనాన్ని అందించాలని ఆదేశించారు. ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు వ‌ర‌కు వారి కుటుంబ సభ్యులకు ఈ వేతనం అందచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సూచించారు.

అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు..

ఎఫ్ఆర్‌వో పార్థివ దేహానికి ప్ర‌భుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల‌ని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం ఆదేశించారు. అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. శ్రీనివాస రావు అంత్యక్రియల్లో పాల్గొని సంబంధిత ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు.

ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై దాడులు స‌హించ‌బోం

విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను ఏమాత్రం సహించబోమని సీఎం స్పష్టం చేశారు. దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. ఎలాంటి జంకు లేకుండా తమ విధిని నిర్వర్తించాలని,ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.

Related posts

వైయస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు.. నలుగురి పేర్లను పేర్కొన్న సీబీఐ!

Drukpadam

భోగి పండ్లను పిల్లల నెత్తిన ఎందుకు పోస్తారు?

Drukpadam

ఇకపై ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్‌ సరఫరా చేయలేం: కేరళ సీఎం విజయన్‌

Drukpadam

Leave a Comment