ఆంధ్రప్రదేశ్

ప్రధానిమోడీ తల్లికి అస్వస్థత ..త్వరగా కోలుకోవాలన్న రాహుల్ గాంధీ !

మోదీ గారు! ఈ కష్ట సమయంలో మీకు నా ప్రేమ, మద్దతు ఉంటాయి: రాహుల్ గాంధీ

  • అస్వస్థతకు గురైన మోదీ తల్లి హీరాబెన్
  • తల్లీకొడుకుల మధ్య అనుబంధం వెలకట్టలేనిదన్న రాహుల్
  • మీ తల్లి త్వరగా కోలుకుంటారన్న కాంగ్రెస్ అగ్రనేత 

ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసర్చ్ సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు బులెటిన్ ద్వారా వెల్లడించారు. అయితే, అనారోగ్యానికి గల కారణాలను మాత్రం వారు వెల్లడించలేదు. మరోవైపు ఈ బాధాకరమైన సమయంలో ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అండగా నిలిచారు.

ట్విట్టర్ ద్వారా రాహుల్ స్పందిస్తూ… తల్లీకొడుకుల మధ్య అనుబంధం అన్నిటికీ అతీతమైనదని, వెలకట్టలేనిదని చెప్పారు. మోదీ గారూ, ఈ కష్ట సమయంలో మీకు నా ప్రేమ, మద్దతు వుంటాయని అన్నారు. మీ మాతృమూర్తి త్వరగా కోలుకుంటారని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. మరోవైపు ఇటీవలే హీరాబెన్ 99వ పుట్టినరోజును జరుపుకోవడం విశేషం.

Related posts

బీజేపీకీ, మోడీకి యూనిఫామ్ కావాలి, కాంగ్రెస్ అన్నింటినీ గౌరవిస్తుంది-రాహుల్ వ్యాఖ్యలు…

Drukpadam

చంద్రబాబుకు క్లీన్‌చిట్.. ఫైబర్‌నెట్‌ కేసును కొట్టేసిన ఏసీబీ కోర్టు..

Ram Narayana

విచారణకు రమ్మంటూ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు!

Drukpadam