Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మాజీ ఎంపీ పొంగులేటికి గులాబీ పార్టీ షాక్ …

మాజీ ఎంపీ పొంగులేటికి గులాబీ పార్టీ షాక్
పొంగులేటితో తెగదెంపులకు సిద్దమైన గులాబీ పార్టీ
ఇంటివద్ద అవుట్ పోస్ట్ తొలగింపుసెక్యూర్టీ 3 +3 నుంచి 2 +2 కు కుదింపు
ఎస్కార్ట్ వాహనం వెనక్కు పిలిపించిన పోలీస్ అధికారులు
సెక్యూర్టీ తగ్గింపు ! మౌనంగా పొంగులేటి
అభిమానుల ఆగ్రహంఖమ్మంలోని శ్రీనివాస్ రెడ్డి నివాసానికి కార్యకర్తలు
పార్టీలో చేరినందుకు కేసీఆర్ ఇచ్చిన బహుమతి అంటు విమర్శలు
అనుయాయులతో పొంగులేటి సంప్రదింపులు

ఖమ్మం మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో తెగదెంపులకు గులాబీ పార్టీ సిద్ధమైంది.అందులో భాగంగా ఆయనకు ఇప్పటివరకు ప్రభుత్వం కల్పిస్తున్న 3 +3 సెక్యూర్టీ ని 2 +2 కు కుదించడమే కాకుండా ఆయన వెంట ఉండే ఎస్కార్ట్ వాహనాన్ని పోలీస్ అధికారులు వెనక్కు పిలిపించారు .అంతే కాకుండా ఖమ్మంలోని ఆయన నివాసం వద్ద ఉంటున్న అవుట్ పోస్ట్ ను కూడా తొలగించారు . దీంతో ఆయన అభిమానులు ప్రభుత్వ చర్యలపై మండిపడుతున్నారు . కేసీఆర్ ను నమ్మి పార్టీలో చేరితే తిరిగి ఎంపీ సీటు ఇవ్వకపోగా , అవమానమరిచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఆయనపై చర్యల ద్వారా కేసీఆర్ మంచి బహుమతి ఇచ్చారని మండి పడుతున్నారు .

గులాబీ పార్టీ ఇచ్చిన షాక్ తో కేసీఆర్ వెంట తిరిగే క్యాడర్ ఒక్కసారిగా కంగు తిన్నది . తిరిగి పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితులు కనిపించకపోవడం , మరికొద్ది నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో ప్రజాబలం ఉన్న ఆయన్ను చేర్చుకొని జిల్లాలో సీట్లు పొందాలని బీజేపీ భావిస్తుంది . అదే సందర్భంలో కాంగ్రెస్ సైతం తమ బలానికి పొంగులేటి బలం తోడైతే జిల్లాలో తిరుగుండదని ఆయన్ను తమ పార్టీలో చేరాలని సంప్రదింపులు జరుపుతుంది. ఆయన ఎవరికీ యస్ అనిగాని , నో అనిగాని చెప్పటంలేదని విశ్వసనీయ సమాచారం . మొదటినుంచి ఆయనకు కేటీఆర్ తో ఉన్న బంధం ఇప్పటివరకు కట్టి పడేసింది.

రానున్న ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో పొత్తుల నేపథ్యంలో కొత్తగూడెం సిపిఐ ,పాలేరు సిపిఎం పట్టు పడుతున్నాయి.దీంతో తమకు సీటు రాదను కున్న నేతలు తమ దారి తాము చూసు కుంటున్నారు . అందులో భాగంగానే తుమ్మల. పొంగులేటిలు జనవరి 1 నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా ఆత్మీయ కలయిక పేరుతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన విందు రాజకీయాలు వారిని ఆలోచనలను చెప్పకనే చెప్పాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

దీంతో రంగంలోకి దిగిన గులాబీ నేతలు వారి కదలికలకు అడ్డు కట్ట వేయకపోతే జిల్లాలో జరగనున్న నష్టంపై కలత చెందినట్లు ప్రచారం జరుగుతుంది .వారిని కట్టడి చేయాలనీ కేటీఆర్ ,కేసీఆర్ పై వత్తిడి తెచ్చారని జిల్లా నేతల కోరిక మేరకు, పొంగులేటి పై చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది. . దీనిపై ఆయన అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు . ప్రభుత్వం ఆయనకు సెక్యూర్టీ తొలగించిన విషయాన్నీ తెలుసుకున్న అభిమానులు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు . హైద్రాబాద్ లో ఉన్న పొంగులేటి తన అనుయాయులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం ….రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లా రాజకీయాలు మరింత హాట్ గా ఉండే అవకాశాలు ఉన్నాయి….!

 

Related posts

బండి సంజయ్ కు చుర‌క‌లంటించిన మంత్రి కేటీఆర్!

Drukpadam

ఢిల్లీలో తెలంగాణా నేతలతో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా ,నడ్డా భేటీ!

Drukpadam

ఢీ అంటే ఢీ అంటున్న వైరి వర్గాలు …అందరి చూపు పాలేరు వైపు …

Drukpadam

Leave a Comment