Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సు సర్వీసులను నిలిపివేసిన టీఎస్‌ఆర్టీసీ!

tsrtc stooped bus services to ap from telangana due to curfew in ap
తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సు సర్వీసులను నిలిపివేసిన టీఎస్‌ఆర్టీసీ!
  • రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉద్ధృతి
  • ఏపీలో కరోనా కట్టడికి కర్ఫ్యూ అమలు
  • అందుకే బస్సు సర్వీసులను నిలిపివేశామన్న టీఎస్‌ఆర్టీసీ
  • ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులపైనా ప్రభావం
  • ఎమర్జెన్సీ వాహనాలకు మినహాయింపు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. దీంతో వ్యాప్తి నివారణకు ఏప్రీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే బస్సులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ వెల్లడించారు. ఉదయం తెలంగాణ నుంచి వెళ్లే బస్సులు మధ్యాహ్నానికి ఏపీలో గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం లేదని..ఈ నేపథ్యంలోనే అనివార్యమై ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.

అయితే, అత్యవసర వాహనాల రాకపోకలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని సునీల్‌ శర్మ తెలిపారు. అలాగే ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులనూ నిలిపివేయాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

Related posts

రాజస్థాన్ లో ఒకే కుటుంబంలో 9 మందికి ఒమిక్రాన్ పాజిటివ్!

Drukpadam

కరోనా మల్లి డేంజర్ బెల్స్ …తస్మాత్ జాగ్రత్త :ప్రపంచ ఆరోగ్య సంస్థ…

Drukpadam

భార‌త్‌కు అమెరికా అందిస్తోన్న‌ సాయంపై శ్వేత‌సౌధం స్పంద‌న‌!

Drukpadam

Leave a Comment