ఆంధ్రప్రదేశ్

ఖమ్మం కు యూనివర్సిటీ ఇవ్వండి …సీఎం కు సీఎల్పీ నేత భట్టి విజ్ఞప్తి!

ఖమ్మం కు యూనివర్సిటీ ఇవ్వండిసీఎం కు సీఎల్పీ నేత భట్టి విజ్ఞప్తి!
పోడు భూములు సమస్య పరిష్కరించండి
మధిర కు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేయండి
అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు , ఇళ్లస్థలాలు ఇవ్వాలి
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

ఖమ్మం యూనివర్సిటీ ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు . బుధవారం ఖమ్మంలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఖమ్మం వచ్చిన కేసీఆర్ ను కలిసి భట్టి సీఎం కు వినపతి పత్రం అందించారు . ఖమ్మంలో జరగనున్న బీఆర్ యస్ సభలో పాల్గొనేందుకు వచ్చిన కేరళ , ఢిల్లీ , పంజాబ్ , సీఎంలు పినారవి విజయన్, కేజ్రీవాల్ , మాన్ యూపీ మాజీ సీఎం అఖిలేష్ , సిపిఐ ప్రధాన కార్యదర్శి డి .రాజా లకు భట్టిని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా పరిచయం చేశారు . తన వినతి పత్రంలో మధిర కు ప్రభుత్వ ఇంజినీరీంగ్ కళాశాల మంజూరి చేయాలనీ కోరినట్లు తెలిపారు . అదే విధంగా పోడు భూముల సమస్య పరిష్కరించాలని , పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు చేయాలనీ కోరినట్లు చెప్పారు . అదే విధంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

Related posts

సొంత ఊర్లో పులకించిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ!

Drukpadam

Ram Narayana

ఇంగ్లాండ్‌లో ఖమ్మం జిల్లా విద్యార్థిని దుర్మరణం…

Drukpadam