Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం జిల్లాలో పొంగులేటి దూకుడు …కార్యకర్తల కోసం దేనికైనా సిద్ధం..!

ఖమ్మం జిల్లాలో పొంగులేటి దూకుడు …కార్యకర్తల కోసం దేనికైనా సిద్ధం..!
-ఆత్మీయసమ్మేళనాలతో పర్యటన జోరు
-కేసీఆర్ ఇచ్చిన హామీలపై తనదైన శైలిలో వాగ్బాణాలు
-అధికారం ఎవరి అబ్బ సొత్తు కాదని హెచ్చరికలు
-ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనుకడుగు వేయబోనని వెల్లడి
-తన వెంట లక్షలాది హృదయాలు ఉన్నాయని ధీమా

ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి బీఆర్ యస్ దూరమైయ్యారు . పైగా జిల్లాలో తన అనుయాయులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ పర్యటనల దూకుడు పెంచారు . వాటికీ ప్రజలు కూడా భారీగానే వస్తున్నారు .ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయసమ్మేళనాలు నిర్వహించగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించేందుకు సన్నద్ధం అవుతున్నారు .
ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతుండగా తాను ఇంకా ఏపార్టీ లో చేరేది నిర్ణయించుకోలేదని అంటున్నారు .అయితే పర్యటనల జోరు పెరిగింది.రాజకీయ సమీకరణాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. సోమవారం మధిరలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనే అధికార టీఆర్ యస్ వాగ్దానభంగాలపై ధ్వజమెత్తారు .

రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఎక్కడైనా వస్తుందా? అని ప్రశ్నించారు. రుణమాఫీ కూడా 20 శాతమే చేశారని ఆరోపించారు. దీనిపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పగలరా? అని నిలదీశారు.

అధికారం ఎవరి అబ్బ సొత్తు కాదని అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనుకడగు వేయను అని స్పష్టం చేశారు. నాడు కురుక్షేత్రంలో కౌరవులంతా ఒక పక్కన ఉన్నారని, కానీ నేడు శీనన్న వెంట లక్షలాది హృదయాల మద్దతు ఉందని, ఆ తుపానులో మీరు కొట్టుకుపోవడం తథ్యం అని వ్యాఖ్యానించారు.

ఓ చిన్న కుటుంబం నుంచి వచ్చిన తనను జిల్లాలో ప్రతి ఒక్క కుటుంబం తమ గుండెల్లో పెట్టి చూసుకుంటోందని, అందుకే ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ తన పక్షానే నడుస్తారని తెలిపారు. శీనన్న ఏ తప్పు చేయలేదని, ఎప్పటికీ తప్పు చేయడని అన్నారు . నమ్ముకున్న కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే విషయంలో శీనన్న వెనుకడుగు వేయబోడని స్పష్టం చేశారు.

“ఒకప్పుడు వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేను, ఖమ్మం ఎంపీగా ఉన్న నేను వారి మాటలు నమ్మి నాడు టీఆర్ఎస్ పార్టీలో చేరాను. నాతో పాటు వందలాది మంది ప్రజాప్రతినిధులు, వేలాది మంది అభిమానులు టీఆర్ఎస్ పార్టీకి జై కొట్టామన్నది నిజం. పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడమే కాకుండా, జిల్లాలో పార్టీ అభ్యర్థుల ఓటమికి పనిచేశానంటూ నాపై నిందలు మోపారు. ఆ తర్వాత పెద్దలు కేసీఆర్, కేటీఆర్ మాట విని నాడు టీఆర్ఎస్ అభ్యర్థి కోసం గ్రామగ్రామాన తిరిగి విజయం కోసం కృషి చేశాను. కానీ నన్ను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు” అని పొంగులేటి వివరించారు.

Related posts

ఫడ్నవిస్ తో విభేదాలపై స్పందించిన షిండే …మాది ఫెవికాల్ బంధమని వ్యాఖ్య …

Drukpadam

కేసీఆర్ నల్లగొండ జిల్లాలోని మునుగోడు నుంచి పోటీకి సిద్దపడుతున్నారా?

Drukpadam

పెగాసస్ ఫోన్ హ్యాకింగ్ కుంభకోణంపై విచారణ కమిటీ వేసిన మమతా బెనర్జీ!

Drukpadam

Leave a Comment