Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మొదలైన మేడారం మినీ జాతర..క్యూకడుతున్న భక్తులు…

మొదలైన మేడారం మినీ జాతర..క్యూకడుతున్న భక్తులు…
-ఘనంగా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు
-నేడు మండమెలిగే పండుగ
-అమ్మ వార్ల గద్దెలను శుద్ధి చేసి, ప్రత్యేక పూజలు

మేడారంలో బుధవారం మినీ వన జాతర మొదలైంది. రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పెద్ద జాతర మధ్యలో మినీ జాతర జరుపుకోవడం ఒక్క గిరిజన ప్రజల ఆనవాయితీ . మినీ జాతరకు సైతం భక్తులు పెద్ద ఎత్తున క్యూకడుతున్నారు .దీంతో రాష్ట్ర ప్రభుత్వం అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తుంది.

ఈ రోజు (బుధవారం) మండ మెలిగే పండుగను నిర్వహిస్తున్నారు. గురు, శుక్ర వారాల్లో అమ్మవార్ల గద్దెలను శుద్ధి చేసి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గతంలో ఈ మినీ జాతరకు మేడారం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మాత్రమే వచ్చేవారు. ఇప్పుడు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నారు. భక్తుల సంఖ్య పెరగడంతో మినీ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

రెండేళ్లకు ఓసారి జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర.. మధ్యలో మినీ జాతర పేరిట ఈ ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న మండమెలిగే పండుగతో మినీ జాతర బుధవారం మొదలైంది. గురు, శుక్ర వారాల్లో సారలమ్మ, సమ్మక్క గద్దెలను శుద్ధి చేసి భక్తులు తమ మొక్కులు సమర్పించుకునేందుకు అనుమతిస్తారు. ఈ మినీ జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం జరగదని, గద్దెలపై ప్రత్యేక పూజలు మాత్రమే చేస్తామని పూజారులు చెప్పారు.

Related posts

మహిళా దర్బార్ సందర్భంగా గవర్నర్ తమిళశై కీలక వ్యాఖ్యలు!

Drukpadam

తానా తదుపరి అధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు.. ఎన్నికల్లో ఘన విజయం…

Drukpadam

10 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపే యోచనలో అమెజాన్!

Drukpadam

Leave a Comment