Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్ర బడ్జెట్ అంతా రాజకీయ జిమ్మిక్కు … తమ్మినేని

కేంద్ర బడ్జెట్ అంతా రాజకీయ జిమ్మిక్కు … తమ్మినేని
పేదలను పట్టించుకోని ప్రభుత్వం
నీతిఆయోగ్ మార్గదర్శకాలను పక్కన పెట్టడం శోచనీయం
ఇది కార్పొరేట్ల బడ్జెట్…

కేంద్ర బడ్జెట్ మొత్తం పక్క రాజకీయ జిమ్మకి తప్ప ఏమి లేదని, ఆర్భాటం తప్ప కేంద్ర బడ్జెట్ ఏమి లేదని,అంతా డొల్లతనం మాత్రమే నని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఒడిదుడుకుల గురించి బడ్జెట్లో ఒక్క మాట కూడా లేదని, నిజాన్ని దాచి అందమైన చిత్రాన్ని చూపేందుకు ఆర్థిక సర్వే ప్రయత్నించిందని ధ్వజమెత్తారు . నిరుద్యోగం, ఆరోగ్యం , విద్య తదితర ముఖ్యమైన సమస్యలను బడ్జెట్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో శక్తినిస్తుందని కేంద్రం చెబుతున్నదని, మరి ఆర్థిక వృద్ధిరేటు 6.5% శాతానికే పరిమిత మవుతుందని ఆర్థిక సర్వే ఎందుకు అంచనా వేసిందని ఆయన ప్రశ్నించారు . గత ఆర్థిక సంవత్సరంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వృద్దిలేటి 9.9% నుంచి 1.6% పడిపోయిందని, ఏకభిగిన నాలుగేండ్ల ఆర్థికవృద్ధి తగ్గటం స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం శోచనీయమని అన్నారు . .ఆహార సబ్సిడీని 29 శాతానికి తగ్గించారని, మధ్యాహ్న భోజనానికి నిధులు 9.4శాతం తగ్గాయని, పౌష్టికాహార పథాకాలకు ఏకంగా 38 శాతం తగ్గాయని విమర్శించారు.

బడ్జెట్లో అణగారిన వర్గాలైన దళితులు గిరిజనులు మైనార్టీలు మహిళల సంక్షేమ పథకాలకు కేటాయింపులు చూసి ఆర్థిక విశ్లేషకులు పెదవులు విరుస్తున్నారని అన్నారు . నీతి ఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం షెడ్యూల్ కులాలు , షెడ్యూల్ తెగలు సంక్షేమానికి జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు తప్పనిసరి అని చెప్పినప్పటికీ , ఈ బడ్జెట్ లో అలా జరపకపోవడం దురదృష్టమని అన్నారు . .దివ్యాంగులపైన కేంద్రం వివక్ష చూపిందని, మైనారిటీలకైతే బడ్జెట్ లో గత ఏడాది కంటే ఏకంగా 33 శాతం నిధులను తగ్గించదని విమర్శించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాచర్ల భారతి,బోంతు రాంబాబు,వై.విక్రమ్, చింతల చేర్వు కోటేశ్వరరావు, భూక్యా వీరభద్రం,బండి రమేష్ మరియు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మండల కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

చీమలపాడు లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని పర్యటన..!

Drukpadam

మ‌ళ్లీ మేమే అధికారంలోకి వ‌స్తాం: కేటీఆర్

Drukpadam

పల్లా గెలుపు నల్లేరు మీద నడకేం కాదు…

Drukpadam

Leave a Comment