ఆంధ్రప్రదేశ్

ముగిసిన తారకరత్న అంత్యక్రియలు!

ముగిసిన తారకరత్న అంత్యక్రియలు!

  • తారకరత్నకు కడసారి వీడ్కోలు పలికిన అభిమానులు, ప్రముఖులు
  • చితికి నిప్పంటించిన తారకరత్న తండ్రి మోహనకృష్ణ
  • అంతిమసంస్కారాలను పర్యవేక్షించిన బాలకృష్ణ

సినీ నటుడు నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానం శ్మశానవాటికలో కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, ప్రముఖుల నడుమ అంత్యక్రియలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ మధ్యాహ్నం 3 గంటలకు తారకరత్న అంతిమయాత్ర ఫిలించాంబర్ నుంచి ప్రారంభమైంది. భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు.

మహాప్రస్థానం శ్మశానవాటిక వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్, కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు తారకరత్న భౌతికకాయానికి కడసారి నివాళులు అర్పించారు. తారకరత్న చితికి ఆయన తండ్రి మోహనకృష్ణ నిప్పంటించారు. తారకరత్న అంతిమసంస్కారాలను బాలకృష్ణ దగ్గరుండి పర్యవేక్షించారు.

Related posts

నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా…

Drukpadam

ఖమ్మం టు సూర్యాపేట నేషనల్ హైవే త్వరలో ప్రారంభం …ఖమ్మం కలెక్టర్ గౌతమ్…

Drukpadam

దావోస్ వెళ్లేందుకు సీఎం జ‌గ‌న్‌కు సీబీఐ కోర్టు అనుమ‌తి

Drukpadam