క్రైమ్ వార్తలు

బస్సులోనే ఉరివేసుకున్న ఆర్టీసీ కండక్టర్!

బస్సులోనే ఉరివేసుకున్న ఆర్టీసీ కండక్టర్!

  • తొర్రూర్ బస్ స్టేషన్‌లో వెలుగు చూసిన ఘటన
  • విధులకు వచ్చిన కొద్ది సేపటికే ఆత్మహత్య 
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ఎప్పటిలాగే ఆదివారం డ్యూటీకి వచ్చిన ఓ ఆర్టీసీ కండక్టర్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నారు. బస్సులోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. తొర్రూర్ మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి తొర్రూర్ ఆర్టీసీ బస్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం యథావిధిగా డ్యూటీకి వచ్చిన ఆయన రిజస్టర్‌లో సంతకం పెట్టి డిపో లోపలికి వెళ్లారు.

మహేందర్ ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది డిపో అంతా గాలించారు. ఈ క్రమంలో ఆయన ఓ బస్సులో విగతజీవిగా కనిపించాడు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. మహేందర్ ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నారనేది ఇంకా తెలియరాలేదు. విధుల్లో ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారా? లేక వ్యక్తితగ కారణాలతో బలవన్మరణానికి పాల్పడ్డారా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related posts

సూట్‌కేసులో కుక్కి గాళ్‌ఫ్రెండ్‌ను హాస్టల్‌కు తెచ్చే యత్నం.. దొరికిపోయిన ఇంజినీరింగ్ విద్యార్థి.. 

Drukpadam

ప్రభుత్వ అధికారి నుంచి రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఈడీ అధికారి

Ram Narayana

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పై ముంబైలో కేసు నమోదు!

Drukpadam