Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

పలు యూట్యూబ్ చానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి హేమ!

పలు యూట్యూబ్ చానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి హేమ!

  • తప్పుడు థంబ్ నెయిల్స్ పెడుతున్నారని హేమ ఆరోపణ
  • అసత్య ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • బతికున్నవాళ్లను కూడా చంపేస్తున్నారని హేమ ఆవేదన
  • న్యాయపోరాటానికి కూడా సిద్ధమేనని వెల్లడి

మూడేళ్ల నాటి ఫొటోలతో తప్పుడు థంబ్ నెయిల్స్ పెట్టి తనపై దుష్ప్రచారం చేస్తున్నాయంటూ కొన్ని యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్లపై టాలీవుడ్ నటి హేమ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడేళ్ల కిందట పెళ్లి రోజు వేడుకల సందర్భంగా భర్తతో ఉన్న ఫొటోలను ఇప్పుడు మరోసారి పోస్టు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని హేమ ఆరోపించారు. దీనిపై తాను న్యాయపోరాటం చేసేందుకు కూడా వెనుకాడడని స్పష్టం చేశారు.

సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేసే యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్లపై చర్యలు తీసుకోవాలని ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. కొందరు సినీ ప్రముఖులు బతికే ఉన్నప్పటికీ, వారు చనిపోయారంటూ డబ్బుల కోసం అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని హేమ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు ఉదాహరణగా కోట శ్రీనివాసరావు అంశాన్ని ప్రస్తావించారు. కోట ఇక లేరంటూ తప్పుడు ప్రచారం చేశారని వెల్లడించారు.

Related posts

తపాకీతో కాల్చుకుని ఎస్సై ఆత్మహత్య!

Ram Narayana

కుప్పం వైసీపీ నేత మృతి.. హత్య చేశారన్న తమ్ముడు!

Drukpadam

అమ‌రావ‌తి అసైన్డ్ భూముల స్కాం నిందితుల‌కు రిమాండ్ తిర‌స్క‌రించిన కోర్టు!

Drukpadam

Leave a Comment