Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాఘురామ వ్యాఖ్యల వెనక చంద్రబాబు : అంబటి…

రాఘురామ వ్యాఖ్యల వెనక చంద్రబాబు : అంబటి…
-రాఘురామ మహానటుడు తనకు తానే గాయాలు చేసుకోగల సమర్ధుడు
-కేసునుంచి బయట పడేందుకు ఎన్ని వేషాలు అయినా వేస్తాడు
-రాఘురామ వ్యాఖ్యలు ఎంత తీవ్రం అయినవో చెప్పాలిసింది కోర్ట్
-బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికాగానే కొత్త డ్రామాలు
-ఇది అంతా చంద్రబాబు డైరక్షన్ లోనే
-రాఘురామ రాజద్రోహానికి పాల్పడినట్లు 46 సి డి లు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యల వెనక ముమ్మాటికీ చంద్రబాబు , ఆయన పచ్చ మీడియా ఉందని వైసీపీ అధికార ప్రతినిధి . ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. అందుకే గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లుగా చంద్రబాబు అండ్ కో ఆయన అరెస్ట్ అయినా దగ్గర నుంచి ఒకటే ఆరాట పడుతున్నాయని అన్నారు. నిజాలు ఎక్కడ బయటకు వస్తాయోనని భయం వారిని వెంటాడుతోందని అన్నారు. అందువల్లనే బెయిల్ తిరస్కరించగానే కొత్తనాటకానికి తెరలేపారని అందులో భాగంగానే గాయాల డ్రామా అని ధ్వజం ఎత్తారు.
ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం, తదనంతరం ఆయన కోర్టులో కుంటుతూ నడవడం, తనను పోలీసులు దారుణంగా కొట్టారని ఆరోపించడం వంటి అంశాలపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు. రఘురామ మహానటుడు అని, తనకు తానే గాయాలు చేసుకుని ఈ కేసు నుంచి బయటపడాలని చూస్తున్నాడని అంబటి ఆరోపించారు. బెయిల్ పిటిషన్ కొట్టివేతకు గురైన వెంటనే రఘురామలో ఎంతమార్పు వచ్చిందో అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వివరించారని తెలిపారు.

రఘురామ వెనకున్నది చంద్రబాబేనని అంబటి పేర్కొన్నారు. రఘురామ వ్యాఖ్యలు ఎంత తీవ్రమైనవో చెప్పాల్సింది న్యాయస్థానాలని, చంద్రబాబు కాదని అంబటి హితవు పలికారు. గత ఏడాది కాలంగా తెలుగుదేశం పార్టీతో జతకట్టిన రఘురామ ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాడని, ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ కేసులో చంద్రబాబు పాత్ర కూడా తేలాలని అన్నారు.

రఘురామ రాజద్రోహానికి పాల్పడినట్టు 46 సీడీలను సీఐడీ అధికారులు కోర్టుకు సమర్పించారని, అలాంటి చీడపురుగును చంద్రబాబు వెనకేసుకొస్తున్నారని అంబటి విమర్శించారు. రచ్చబండ అంటూ రఘురామకృష్ణరాజుతో నిత్యం బూతులు తిట్టించడం టీడీపీ నేతలకు, పలు చానళ్లకు అలవాటైందని అన్నారు. ఎంపీ అరెస్ట్ తో తమ కుట్రలు ఎక్కడ బయటపడతాయో అని చంద్రబాబు, పలు మీడియా సంస్థలు కలవరపాటుకు గురవుతున్నట్టు అంబటి విమర్శించారు.

Related posts

ఓటు బ్యాంకు లేని పవన్ కళ్యాణ్… అమిత్ షా వద్ద కె ఏ పాల్!

Drukpadam

డ్రామా రాజకీయాలను జగన్ మానుకోవాలి: జీవీఎల్ నరసింహారావు!

Drukpadam

పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి ధ్వజం …

Ram Narayana

Leave a Comment