రాజకీయ వార్తలు

కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్… ప్రధాని మోడీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెటైర్…

కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్… ప్రధాని మోడీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సెటైర్…

  • వివిధ మఠాధిపతులతో పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోడీ ఫోటో
  • ట్విట్టర్ వేదికగా ప్రధానికి చురకలు అంటించిన మమతా
  • స్వాతంత్రం వచ్చాక… ఇప్పుడు అంటూ నెహ్రూ, మోడీ ఫోటోలతో ట్వీట్

కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకు పడ్డారు. ఆమె ట్విట్టర్ వేదికగా తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ప్రస్తుత ప్రధాని మోడీలు పార్లమెంటు ఆవరణలో దిగిన ఫోటోలతో విమర్శలు గుప్పించారు. మే 28న జరిగిన కొత్త పార్లమెంటు కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చిన వివిధ తమిళనాడు మఠాల నుండి వచ్చిన మఠాధిపతుల బృందంతో ప్రధాని మోడీ ఫోటో దిగారు.

మమత ఈ చిత్రాన్ని భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో లింక్ చేశారు. రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్, బిఆర్ అంబేడ్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితరులు ఉన్న ఫోటోను, మోడీ, మఠాధిపతులతో ఉన్న ఫోటోను ట్వీట్ చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఇప్పుడు అంటూ రెండు ఫోటోలకు క్యాప్షన్ పెట్టారు.

Related posts

సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ కు నిరసన సెగ…!

Drukpadam

బీజేపీని వీడిన మాజీ మంత్రి చంద్రశేఖర్

Ram Narayana

అమరావతి రాజధాని నిర్మాణంలో భారీ అవినీతి …చంద్రబాబుకు ఐటీ నోటీసులు …అసెంబ్లీ లో సీఎం జగన్

Drukpadam