Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

హ‌రీశ్ రావుతో క‌లిసి గాంధీ ఆసుప‌త్రిలో క‌రోనా రోగుల‌ను ప‌రామ‌ర్శించిన సీఎం కేసీఆర్..

  • రోగుల‌కు ధైర్యం చెప్పిన కేసీఆర్
  • ఆక్సిజ‌న్, ఔష‌ధాల ల‌భ్య‌త గురించి ఆరా
  • ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారుల‌కు దిశా నిర్దేశం

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుప‌త్రిని సంద‌ర్శిస్తున్నారు. ఆయనతో పాటు మంత్రి హ‌రీశ్ రావు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, ప‌లువురు అధికారులు కూడా వున్నారు. ఆక్సిజ‌న్, ఔష‌ధాల ల‌భ్య‌త గురించి ఆసుప‌త్రి వైద్యుల‌ను అడిగి తెలుసుకుంటున్నారు. ఆసుప‌త్రుల్లో ఆక్సిజ‌న్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారుల‌కు దిశా నిర్దేశం చేశారు.

గాంధీ ఆసుప‌త్రిలో క‌రోనా అత్య‌వ‌స‌ర వార్డును కూడా సీఎం సంద‌ర్శించారు. చికిత్స పొందుతోన్న క‌రోనా రోగుల‌ను ప‌రామ‌ర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఓపీ విభాగంలోనూ క‌రోనా చికిత్స స‌దుపాయాల‌పై కేసీఆర్ ఆరా తీస్తున్నారు. జూనియ‌ర్ డాక్ట‌ర్లు, ఇత‌ర వైద్య సిబ్బందిని కేసీఆర్ అభినందించారు. కాగా, కేసీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో గాంధీ ఆసుప‌త్రి వ‌ద్ద పోలీసులు భారీగా బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

Related posts

ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు.. మాస్క్ ధరించకుంటే జరిమానా!

Drukpadam

మళ్ళీ ప్రపంచవ్యాపితంగా కరోనా విజృంభణ …..

Drukpadam

హైదరాబాద్‌ చేరుకున్న స్పుత్నిక్ వి టీకాలు…..

Drukpadam

Leave a Comment