Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దు: మంత్రి మల్లారెడ్డి

  • బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దు: మంత్రి మల్లారెడ్డి
  • పోలీస్ స్టేషన్లో జిమ్ లు ఏర్పాటు చేయాలని సూచన
  • పోలీసులు ఫిట్ గా ఉండాలన్న మంత్రి
  • దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని వ్యాఖ్య

నిత్యం వార్తల్లో ఉండే వ్యక్తి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి శాసనసభలోని బయట ఆయన మాటలు నవ్వులు కురిపిస్తుంటాయి. శాసనసభలో మాట్లాడుతూ తాను పాలు అమ్మి మంత్రినయ్యానని ,ప్రధాని మోడీ చాయ్ అమ్మి ప్రధాని అయ్యాడని బీజేపీపై సైటర్లు వేశారు . నిజామాబాద్ లో మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ లపై కామెడీ చేశారు . నేడు పోలీసులపై ఆయన ద్రుష్టి మళ్లింది . పోలీసులకు బొజ్జలు ఉంటె ప్రమోషన్లు ఇవ్వద్దని అన్నారు .బొజ్జలున్న వాళ్ళు రాజకీయాలకు పనికి వస్తారు కానీ పోలీసులు ఉద్యోగాలకు పనికి రారని ఆయన అర్థం అయ్యి ఉండవచ్చు కానీ బొజ్జలు లేని రాజకీయ నాయకులు పరీక్షలు రాసి పోలీస్ ఉద్యోగాలు చేసి బొజ్జలు ఉన్న పోలీసులను రాజకీయాల్లోకి పంపించరాదే మల్లన్న అంటున్నారు సరదాగా కొందరు …

బొజ్జ ఉన్న పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వొద్దని తెలంగాణ హోం మంత్రి మొహమూద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ లను మంత్రి మల్లారెడ్డి కోరారు. పోలీసులు ఫిట్ నెస్ పెంచుకోవడానికి పోలీస్ స్టేషన్లలోనే జిమ్ లు ఏర్పాటు చేయాలని అన్నారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రస్తుతం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, మన పోలీసులు బాగా పని చేస్తున్నారని, కేసులను తొందరగా పరిష్కరిస్తున్నారని ప్రశంసించారు. పోలీసుల తమ మాదిరి మంచి ఫిట్ గా ఉండాలని చెప్పారు. పోలీసులను చూస్తే దొంగలు భయపడిపోవాలని అన్నారు. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Related posts

రాజస్థాన్ విద్యార్థి సంఘాల ఎన్నికల్లో సరికొత్త ప్రచారం!

Drukpadam

స్వపక్షం, ప్రతిపక్షం అనేవి రాజకీయాల్లోనే ఉంటాయి, తమకు అందరూ సమానమే: చిన్నజీయర్ స్వామి!

Drukpadam

కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ పేరు… సీఎం జగన్ ప్రకటనతో హృదయం ఉప్పొంగిందన్న చిరంజీవి

Drukpadam

Leave a Comment