Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

గుజరాత్ లో తుపాను సహాయచర్యలకు రూ.1000 కోట్లు ప్రకటించిన ప్రధాని మోదీ!

తుఫాన్ సహాయం గుజరాతుకు 1000 కోట్లు!
-గుజరాత్ వద్ద తీరం దాటిన తౌతే
-ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రధాని
-అహ్మదాబాద్ లో సమీక్ష సమావేశం
-గుజరాత్ లో నష్టం అంచనాకు కేంద్ర బృందం ఏర్పాటు
-మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
-మిగతా రాష్ట్రాలకు సహాయం ప్రధాని

తౌతే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆ తర్వాత అహ్మదాబాద్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తౌతే విధ్వంసానికి గురైన గుజరాత్ కు రూ.1000 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారు. గుజరాత్ లో తుపాను నష్టంపై అంచనాకు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా తౌతే తుపాను కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు.

అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌతే తుపాను గుజరాత్ లోని పోరుబందర్, మహువా మధ్య తీరం దాటింది. తీరం దాటే సమయంలో ఇది పెను తుపాను స్థాయిలో ఉండడంతో విధ్వంసం కూడా అదే స్థాయిలో జరిగింది. గుజరాత్ లోని 12 జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. దీని ప్రభావంతో 45 మంది మరణించారు. ఒక్క ఆమ్రేలీ జిల్లాలోనే 15 మంది మృతి చెందారు. అపార ఆస్తినష్టం సంభవించింది


అహ్మదాబాద్ లో సమీక్షకు ముందు ప్రధాని మోడీ ప్రత్యేక విమానంలో ఏరియల్ సర్వే చేపట్టారు
తౌతే తుపాను సృష్టించిన విధ్వంసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. గుజరాత్, డయ్యూలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన నేడు పర్యటించారు . ఢిల్లీ నుంచి ఈ ఉదయం భావ్ నగర్ చేరుకున్న మోదీ… ఉనా, డయ్యూ, జాఫరాబాద్ ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా గగనతలం నుంచి పరిశీలించారు. గిర్, సోమ్ నాథ్, భావ్ నగర్, అమ్రేలీ జిల్లాతో పాటు డయ్యూలో తౌతే మిగిల్చిన నష్టాన్ని అంచనా వేశారు.

ఈ సందర్భంగా ప్రధాని వెంట అధికారులు కూడా ఉన్నారు. తౌతే తుపాను విధ్వంసం తాలూకు వివరాలను వారు ప్రధానికి తెలిపారు. దీనిపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తుపాను బాధిత రాష్ట్రాలకు కేంద్రం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు.

అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌతే తుపాను పెను తుపానుగా మారి పశ్చిమ తీరాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. కర్ణాటక, కేరళ, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, డయ్యూ ప్రాంతాలు తౌతే ధాటికి ప్రభావితమయ్యాయి.

Related posts

యూ పీ లో పోలీస్ స్టేషన్ కు పవర్ కట్ చేసిన లైన్ మ్యాన్!

Drukpadam

రాష్ట్రంలో పంట రుణాల్లో కోత … సిపియం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు!

Drukpadam

హైదరాబాద్ లో గాలి మరింత కలుషితం.. ఆజ్యం పోసిన దీపావళి టపాసులు!

Drukpadam

Leave a Comment