Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి …జూపల్లి కాంగ్రెస్ కు జై !…15 సీట్లు ఇచ్చే అవకాశం …?

పొంగులేటి జూపల్లి కాంగ్రెస్ లో చేరిక ఖాయం …15 సీట్లు ఇచ్చేందుకు అంగీకారం !
-సింహభాగం సీట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే
-ఫలించిన సునీల్ కనుగోలు దౌత్యం …రాహుల్ దూతగా గట్టి హామీ
-రాహుల్ హామీతో సంతృప్తి చెందిన పొంగులేటి ,జూపల్లి
-రాహుల్ లేదా ప్రియాంక సమక్షంలో పార్టీలో చేరిక ….ఖమ్మంలో భారీ సభ
-జూన్ చివరి వారంలో ఖమ్మం సభకు ఏర్పాట్లు

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్ కు జై కొట్టనున్నారు…ఏవైనా అనికొని అవాంతరాలు రాజకీయ వత్తుడులు వస్తే తప్ప 99 శాతం మార్పు లేకపోవచ్చు …   వారు కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది … వారి చేరిక ఇక లాంఛనమే… రాష్ట్రంలో వీరికి 15 సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించిందని సమాచారం …అందులో ఖమ్మం జిల్లాలో దాదాపు సింహభాగం సీట్లు ఉన్నాయి. మహబూబ్ నగర్ లో 3 లేదా నాలుగు , హైద్రాబాద్ లో సికింద్రాబాద్ కొంటోన్మెంట్ మరో రెండు చోట్ల గెలిచే అభ్యర్థులను పొంగులేటి టీం ప్రతిపాదిస్తుంది. దానికి ఖశ్చితంగా గెలిచే అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని సమాచారం …ఖమ్మం జిల్లాలో ఒక్క మధిర తప్ప మిగతా 9 సీట్లు పొంగులేటి కోరుతున్నారని సమాచారం . దానిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాహుల్ టీం పొంగులేటికి హామీ ఇచ్చింది.

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొంతకాలంగా సాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరదించనున్నారు . తన రాజకీయ భవిష్యత్ పై ఒక స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు గుప్పు మంటున్నాయి. ఇది నిజమేనా వారు కాంగ్రెస్ లో చేరబోతున్నారా…? అని వివిధ రాజకీయ పార్టీల నాయకులూ వాకబు చేస్తున్నారు . అన్ని చానళ్ళు ,సోషల్ మీడియా , డిజిటల్ మీడియా లో పొంగులేటి ,జూపల్లి లు కాంగ్రెస్ లో చేరుతున్నారనే వార్తలు సంచలనంగా మారాయి. ఇవి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దాదాపు వారు కాంగ్రెసులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది నిజమేనని పొంగులేటి అనుయాయులు సైతం అంగీకరిస్తున్నారు . పొంగులేటి నిర్ణయం తీసుకోబోయేముందు ఇప్పటివరకు తన వెన్నంటి ఉన్న ముఖ్యనేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం …పొంగులేటి నిర్ణయాన్ని సమావేశంలో అందరు హర్షించినట్లు తెలుస్తుంది. ఏ ఒక్కరు ఆయన నిర్ణయంపై భిన్నాభిప్రాయం చెప్పకపోవడం గమనార్షం …అందరి మొహాల్లో సంతోషం వ్యక్తమైందని అంటున్నారు .

పొంగులేటి ,మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి చేరికకు అంగీకారం కుదిరింది. అయితే ఈ ఇద్దరితోపాటు మరికొందరు రాష్ట్రంలో ఉన్న ముఖ్యనేతలు కూడా చేరతారని సమాచారం . వారు ఎవరనేది రహస్యమేనని అంటున్నారు . రాష్ట్రంలో గతంలో బీజేపీలో చేరిన కొంతమంది నేతలు కూడా ఇందులో ఉన్నారా,,,? అనే సందేహాలు కలుగుతున్నాయి.

అయితే సభ ఎక్కడ పెట్టాలనేదానిపై తర్జనభర్జనలు జరిగినప్పటికీ ఖమ్మంలో జూన్ చివరి వారంలో భారీ బహిరంగసభ పెట్టి అందులో పొంగులేటి ,జూపల్లి లు కాంగ్రెస్ కండువాలు కప్పుకోనున్నారు .ఈ సభకు రాహుల్ లేదా ప్రియాంక గాంధీ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు . తర్వాత మరొక పెద్ద సభను కొల్లాపూర్ లేదా అలంపూర్ లలో పెట్టాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం . పొంగులేటి ,జూపల్లి లు కాంగ్రెస్ లో చేరుతున్నారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో హైద్రాబాద్ లో ఉన్న పొంగులేటి ఇంటికి, కార్యాలయానికి పెద్ద ఎత్తున చానళ్ళు ,మీడియా ప్రతినిధులు చేరుకొని ఆయన ఇంటర్యూ లకోసం ఎదురు చూస్తున్నారు . అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మరో రెండు మూడు రోజుల్లో తన నిర్ణయం చెపుతానని పొంగులేటి అంటున్నారు .

ఈ మొత్తం కథ వెనక కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఉన్నారు ఆయన కాంగ్రెస్ అధిష్టానంతో ప్రత్యేకించి రాహుల్ గాంధీతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాలు గురించి బ్రీఫ్ చేస్తున్నారు . పొంగులేటి ,జూపల్లి పార్టీలో చేరిక ద్వారా సునామి వస్తుందని కాంగ్రెస్ పెద్దలు నమ్ముతున్నారు . అందుకే పొంగులేటి ,జూపల్లిలను కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు సునీల్ కనుగోలు చాల పెద్ద ప్రయత్నమే చేశారు . అనేక సార్లు వారితో సిట్టింగ్ లు వేశారు . గంటల తరబడి చర్చలు చేసిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు ,బీఆర్ యస్ కు ప్రత్యాన్మయం గురించి ఒక క్లారిటీకి వచ్చారు . బీఆర్ యస్ తో బీజేపీ సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు కూడా వారి మధ్య చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానంగా లిక్కర్ స్కాం లో కవిత మూడు సార్లు ఈడీ వద్దకు విచారణకు హాజరైనప్పటికీ అరెస్ట్ చేయకపోవడాన్ని ఎత్తి చూపుతున్నారు . అంతకు ముందు కాళేశ్వరం ప్రాజక్టు విషయంలో అవినీతి జరిగిందని సీఎం కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పినప్పటికీ అలాంటిది జరగలేదు . అందువల్ల రెండు పార్టీల మధ్య ఏమైనా రహస్య అవగాహన ఉందా అనుమానాలు కూడా పొంగులేటి , జూపల్లి వ్యక్తం చేశారు . బీజేపీలో చేరేందుకు ఆపార్టీ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ గట్టి ప్రయత్నమే చేశారు . ఒక సందర్భంలో వారు కూడా బీజేపీలోకి వెళ్లేందుకు మొగ్గు చూపారు . అయితే కర్ణాటక ఎన్నికల తర్వాత నిర్ణయిం తీసుకోవాలని వాయిదా వేశారు .కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం బీజేపీ శ్రేణులను నిరుత్సాహానికి గురిచేసింది. అందులో చేరాలని అనుకున్నవారు సైతం వెనక్కు జారుకున్నారు . ఈటెల తర్వాత కూడా పొంగులేటి ,జూపల్లిలతో చర్చలు జరిపినా ఫలితం ఇవ్వలేదు . పైగా వారు తనకే కౌన్సిలింగ్ ఇస్తున్నారని ఈటెల చెప్పడం సంచలనంగా మారింది.

బీజేపీ లో ఉన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో అధిష్టానం సీరియస్ గా ఉంది. కొంతకాలం క్రితం వరకు రాష్ట్రంలో బీఆర్ యస్ ప్రత్యాన్మయం బీజేపీ అని అనుకున్న కర్ణాకట ఎన్నికల ఫలితాలు , రాష్ట్ర బీజేపీలో నాయకత్వంలో సమన్వయ లోపం కారణంగా ,అందరు ద్రుష్టి కాంగ్రెస్ వైపు మళ్లింది. దీన్ని కాంగ్రెస్ తనకు అడ్వాంటేజ్ గా మార్చుకుంటుందని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం…

 

Related posts

అవును బారాబర్ మాది కుటుంబ పాలనే …అసెంబ్లీ లో కేటీఆర్

Drukpadam

తెలంగాణ‌కు ప‌నికొచ్చే ఒక్క మాట కూడా అమిత్ షా ప్ర‌సంగంలో లేదు: కేటీఆర్‌

Drukpadam

పార్ల‌మెంటు నుంచి త‌ల్లి సోనియాతో క‌లిసి ఒకే కారులో వెళ్లిన రాహుల్ గాంధీ… 

Drukpadam

Leave a Comment