Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ లో జోష్ మీద ఉన్న ఉద్యోగ సంఘాలు …సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపున్న నేతలు …

ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల ఉద్యమం ముగిసింది: బొప్పరాజు

  • ఉద్యోగుల ఆందోళనలు ముగించామన్న బొప్పరాజు
  • 47 డిమాండ్లలో 37 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించినట్టు వెల్లడి
  • ఓపీఎస్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని సూచన

ఉద్యోగుల ఆందోళనలు, ఉద్యమాన్ని ముగించామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఇచ్చిన 47 డిమాండ్లలో 37 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు.

జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను పునర్ వ్యవస్థీకరణ చేయాలని కోరుతున్నామని బొప్పరాజు పేర్కొన్నారు. ఓపీఎస్ విధానం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని అన్నారు. జీపీఎస్ అమలుకు ముందు మరోసారి సమీక్ష చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.

కాగా, ఇవాళ ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కూడా సీఎం జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకువస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇప్పుడు ఓపీఎస్ తో సమానంగా ప్రయోజనం కలిగించేలా జీపీఎస్ ను తీసుకువచ్చారని వివరించారు.

ఉద్యోగులు రిటైర్ అయ్యాక భద్రత కల్పించేలా జీపీఎస్ తెచ్చారని తెలిపారు. జీపీఎస్ తీసుకువచ్చినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపామని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. జీపీఎస్ విధానం దేశానికి రోల్ మోడల్ లా ఉంటుందని… జీపీఎస్ తో నష్టం ఉండదని, మేలు జరుగుతుందని సీఎం చెప్పారని వివరించారు.

ఇక, ఇళ్ల స్థలాల డిమాండ్ పై ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

 

సీఎం జగన్ కు ధన్యవాదాలు… ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను స్వాగతిస్తున్నాం: బండి శ్రీనివాసరావు

Bandi Srinivasarao thanked CM Jagan

ఏపీ ఎన్జీవో నేతలు నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. బండి శ్రీనివాసరావు, శివారెడ్డి, ఇతర ఉద్యోగ నేతలు సీఎంను కలిసినవారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, క్యాబినెట్ సమావేశంలో 12వ పీఆర్సీ ప్రకటించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెల్లడించారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించినందుకు, బకాయిలు 36 విడతల్లో ఇచ్చేలా చర్యలు తీసుకున్నందుకు, అన్ని జిల్లాల్లో ఒకే హెచ్ఆర్ఏ ఇచ్చినందుకు కూడా సీఎంకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు మంత్రులు, సీఎస్ కృషి చేశారని బండి శ్రీనివాసరావు కొనియాడారు.

ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ లేని పెన్షన్ ఇవ్వాలని కోరామని వెల్లడించారు. అయితే కాంట్రిబ్యూషన్ లేని విధానం భారమవుతుందని సీఎం చెప్పారని వివరించారు. జీపీఎస్ లో ఉద్యోగికి నష్టం జరిగినా ప్రభుత్వమే బాధ్యతను స్వీకరిస్తుందని అన్నారని తెలిపారు.

ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను స్వాగతిస్తున్నామని బండి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇక, పీఆర్సీ చైర్మన్ గా ఎవరిని నియమించినా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

Related posts

జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు.. సీబీఐ పిటిషన్

Ram Narayana

విద్యుత్ బిల్లు ప్రతి నెలా మీరు చెల్లించక్కర్లేదు.. పేటీఎంలో ఆటో పే ఆప్షన్!

Drukpadam

దొరకని మోదీ, అమిత్ షా అపాయింట్ మెంట్లు… ఢిల్లీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు

Drukpadam

Leave a Comment