Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

ఆత్మగౌరవ నినాదం …తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు జై అన్న పొంగులేటి , జూపల్లి …

జై కాంగ్రెస్ అన్న పొంగులేటి ,జూపల్లిఖర్గే , రాహుల్ తో ఉన్నతస్థాయి సమావేశం
జులై 2 ఖమ్మం లో పొంగులేటి ,జులై 14 లేదా 16 మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి చేరికకు ముహూర్తం ఖరారు
పదవులకోసం పార్టీలో చేరడంలో ఆత్మగౌరవం కోసమే చేరుతున్నాంపొంగులేటి
తెలంగాణ ఇచ్చిన సోనియా ఋణం తీర్చుకుంటాం ..జూపల్లి 

 

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు లు కాంగ్రెస్ కు జైకొట్టారు .వీరువురు నేతల బృందం భారీస్థాయిలో ఢిల్లీ చేరుకొని ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే , ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు .ఈసమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు పలువురు పాల్గొన్నారు . ఈసందర్భంగా పొంగులేటి , జూపల్లి బృందాన్ని ఏఐసీసీ నేతలు పార్టీలో రావాలని ఆహ్వానించారు . అందుకు వారు తాము సమ్మతి తెలిపారు . పార్టీలో అందరు నేతలు ఐక్యంగా పనిచేయాలని తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు . ఏఐసీసీ పెద్దలతో సమావేశం అనంతరం పొంగులేటి ,జూపల్లి మీడియా తో మాట్లాడుతూ కాంగ్రెస్ లో తాము చేరికకు కారణాలు వివరించారు .పదవులకోసం తాము పార్టీ మారడంలేదని బీఆర్ యస్ అవమానాలు భరించలేక కాంగ్రెస్ పార్టీకి జైకొట్టాడుతున్నామని వారు స్పష్టం చేశారు . మనిషిని మనిషిలా చేసే సంస్కృతీ కోరుకుంటున్నామని బీఆర్ యస్ లో కేసీఆర్ లో అది లేదని తెలుసుకున్నామని ఇది బాధాతప్త హృదయంతో చెపుతున్నామని అన్నారు . కేసీఆర్ గారడీలు ఇక చెల్లవని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని బలంగా ఉందని అన్నారు .బీ ఆర్ యస్ ను గద్దె దించడమే తాము లక్ష్యమని అందుకు తాము నిర్వహించిన సర్వేలలో కాంగ్రెస్ పార్టీకే అదిసాధ్యమని తేలిందని అందువల్ల కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు .   

బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. జులై 2 ఖమ్మంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ జరగనుంది. సభలో పొంగులేటిరాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇవాళ ఢిల్లీలో పొంగులేటి కాంగ్రెస్ నేతలతో భేటీలు జరుపుతూ బిజీగా గడిపారు. పార్టీలో చేరికపై రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు

తాను పదవి కోసమే అయితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోనని, అవినీతి బీఆర్ఎస్ ను గద్దె దింపేందుకే కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నామని స్పష్టం చేశారు.

 “కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేదు, దేశంలో అధికారంలో లేదుకాంగ్రెస్ లోకి వెళితే నాకు ఇబ్బందులు ఉంటాయని తెలుసు. ఆల్రెడీ సమస్యలు మొదలయ్యాయి కూడా. అయినా కూడా, ప్రజల కోసం, ప్రజల మనోభావాల కోసం కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో పార్టీకి తెలంగాణ బిడ్డల రుణాన్ని తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం

తెలంగాణ బిడ్డలు కోరుకున్నది ఇంకా నెరవేరలేదు. ప్రజలు, యువత ఏం కోరుకుంటున్నారో పరిశీలించాం. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవం కోల్పోయారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని అనుకున్నారు. నాకు పదవులు అక్కర్లేదు, పదవుల కంటే ఆత్మాభిమానమే ముఖ్యం

నేను రాష్ట్రంలోని పరిస్థితులపై సర్వే చేయించాను. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఒకవైపే కేంద్రీకృతమై ఉంది. దశలో కొత్తగా ప్రాంతీయ పార్టీ పెట్టాలన్న ఆలోచన కూడా వచ్చింది. రాజకీయ పార్టీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ కూడా జరిపించాను. కొత్త పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని భావించాను

అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. అదే సమయంలో తెలంగాణలో బీజేపీ పరిస్థితి దిగజారుతోంది. నేపథ్యంలోనే, కాంగ్రెస్ వైపు అడుగులు వేశాను. జులై 2 రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానుఅని పొంగులేటి వెల్లడించారు

కేసీఆర్ వి ఆచరణకు సాధ్యం కాని హామీలని విమర్శించారు. మాయమాటలు చెప్పడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు విధంగా మాయమాటలు చెప్పలేకే గతంలో కాంగ్రెస్ ఓటమి పాలైందని పొంగులేటి అభిప్రాయపడ్డారు. ఎన్నికలు వచ్చాయంటే కేసీఆర్ కొత్త స్కీములు తెరపైకి తెస్తారని, మూడోసారి కూడా గారడీ మాటలతో సీఎం కావాలని కేసీఆర్ అనుకుంటున్నారని విమర్శించారు.

ప్రియాంకతో పొంగులేటి ,జూపల్లి

 

 కాంగ్రెస్ ను గెలిపించి తెలంగాణ ప్రజలు సోనియా రుణం తీర్చుకోవాలి: జూపల్లి

  • జూపల్లి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం
  • వచ్చే నెల 14 కానీ, 16 కానీ కాంగ్రెస్ లో చేరనున్న జూపల్లి
  • నేడు ఢిల్లీలో ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసిన జూపల్లి
Jupalli press meet in New Delhi

బీఆర్ఎస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి జూపల్లి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. రాహుల్ గాంధీని కలిసి పార్టీలో చేరికపై చర్చించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యం పాతాళానికి పడిపోయిందని, అవినీతి ఆకాశానికి ఎగసిందని అన్నారు. అన్నీ అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు అడ్డగోలు హామీలు ఇచ్చి, ఎన్నికల్లో గెలిచాక వాటిని అమలు చేయలేక మళ్లీ కొత్త స్కీములు తెస్తున్నారని, ఇంతకంటే దుర్మార్గమైన పాలన ఇంకెక్కడా ఉండదని పేర్కొన్నారు

కేసీఆర్ వంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటారని తెలిస్తే, అంబేద్కర్ ఇంకా కొన్ని కొత్త అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచేవారని జూపల్లి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుక ఉండరాదని, అసలు ప్రతిపక్షమే ఉండకూడదంటూ సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను ఇది అవమానించడమేనని అన్నారు

ఇప్పుడు మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ఉండడంతో నూతన సచివాలయం, అంబేద్కర్ విగ్రహం అంటూ ప్రజలను మభ్యపెడుతున్నాడని విమర్శించారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగాప్రజలకు చెందిన ఖజానాలోని వందల కోట్ల నిధులను దుర్వినియోగం చేస్తున్నాడని జూపల్లి మండిపడ్డారు. భారతదేశ చరిత్రలోనే ప్రభుత్వ నిధులతో ప్రకటనలు ఇచ్చుకుంటూ ప్రజలను ఇంతగా మోసపుచ్చడం ఎక్కడా లేదని అన్నారు

అవినీతి, కుటుంబ పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం, బోగస్ మాటలుఇవన్నీ చూశాక చాలా పొరపాటు చేశామని అనిపించింది. కేసీఆర్ ప్రభుత్వ పాలన చూస్తుంటే గత ప్రభుత్వాలు పాలించినంత స్థాయిలో కూడా లేదు. ఎక్కడ చూసినా రకరకాల స్కీములువాటి వెనుక తోడే కొద్దీ అవినీతి బయటికి వస్తోంది. కాబట్టి ప్రభుత్వం మూడోసారి పరిపాలించే నైతిక అర్హత కోల్పోయిందని భావిస్తున్నాం

ఇప్పుడే నియంత పోకడలు కనిపిస్తున్నాయిమళ్లీఅధికారంలోకి వస్తే మంత్రులను, ఎమ్మెల్యేలను కనీసం మనుషులుగా గౌరవిస్తారని మేం అనుకోవడంలేదు. అందుకే బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకూడదు. నాడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రమాదంలో పడినా కానీ సోనియా గాంధీ ఎంతో రిస్క్ తీసుకుని తెలంగాణ ఇచ్చారు. ఉద్యమ పార్టీ అన్న అభిప్రాయంతో తెలంగాణ ప్రజలు కేసీఆర్ పార్టీని గెలిపించారు

ఇప్పుడీ పరిపాలన చూశాక రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి పరిస్థితి అర్థమైంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందిఅది మా బాధ్యత కూడా. ఇలాంటి పరిస్థితుల్లో, ఇకనైనా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధికారం ఇవ్వకపోతే దేవుడు కూడా క్షమించడు. ఇది ప్రజలకైనా, ప్రజా ప్రతినిధులకైనా వర్తిస్తుంది. కారణాల వల్లే మేం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వారం కిందటే మమ్మల్ని కలిశారు. ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశాం. కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి మహబూబ్ నగర్ లో సభ ఏర్పాటు చేస్తాం. వచ్చే నెల 14 కానీ, 16 కానీ కాంగ్రెస్ లో చేరతానుఅని జూపల్లి వివరించారు.

తెలంగాణ ఇంచార్జి మాణిక్యరావు ఠాక్రే విడుదల చేసిన పార్టీలో చేరే వారి జాబితా

Related posts

ముర్ము విజయోత్సవ సభకు ఫుల్లుగా మందుకొట్టి వచ్చిన గుజరాత్ బీజేపీ నేత…!

Drukpadam

తుమ్మలకు నల్గొండ , పొంగులేటి వరంగల్ …ఇంచార్జి భాద్యతలు

Ram Narayana

దొడ్డి కొమరయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చర్యలు …సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment