Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకే కేసీఆర్ కుట్ర …అందుకే అఖిలేష్ తో మంతనాలు .. సీఎల్పీ నేత భట్టి ..

ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకే కేసీఆర్ కుట్ర …అందుకే అఖిలేష్ తో మంతనాలు .. సీఎల్పీ నేత భట్టి ..
-బీఆర్ యస్ కు వేసే ప్రతిఓటు బీజేపీకే లాభం …
-పునర్నిర్మాణం పేరుతో నయా జాగీర్ పాలన చేస్తున్న కేసీఆర్
-బీఆర్ఎస్ వి మధ్య యుగపు కాలం నాటి ఆలోచనలు
-కాళేశ్వరంపై కేటీఆర్ వి ఆవగావన లేని మాటలు
-కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీరు ఇచ్చారా ..?
బ్రాంచ్ కెనాల్స్ ,పంటకాల్వలు తవ్వరా ..
-తెలంగాణ జన గర్జన సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు

ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకు సీఎం కేసీఆర్ పడరానిపాట్లు పడుతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు . మంగళవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను తూర్పారబట్టారు . . బీహార్ అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ను ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడటం అందుకేనని అనుమానాలు కలుగుతున్నాయని భట్టి అభిప్రాయపడ్డారు . రాహుల్ గాంధీ తెలంగాణ గర్జన సభలో చెప్పినట్లు బీఆర్ యస్ ,బీజేపీకి బీ టీం అని అన్నారు .బీఆర్ యస్ కు వేసే ప్రతిఓటు బీజేపీకే ఉపయోగపడుతుందని అన్నారు .

తెలంగాణ పునర్నిర్మాణం అంటే గడీల సంస్కృతినా …?అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఖమ్మం లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నట్లు జిల్లా పోలీస్ యంత్రంగానికి ముందే తెలుసని అయినప్పటికీ ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నాలు విఫలమైయ్యారని అన్నారు . బాల్ ఎంత గట్టిగ కొడితే అంత వేగిసిపడినట్లు ప్రజాసమూహం తండోప తండాలుగా వచ్చి సభను జయప్రదం చేశారని అన్నారు.

నేడు రాష్ట్రంలో మధ్యయుగపు కాలంనాటి సంస్క్రుతి కనిపిస్తుందని తెలంగాణ ను పునర్నిర్మానం చేస్తున్నాము అంటూ హైదరాబాద్ రాష్ట్రంలో చూసిన నిజం నిరంకుశ పాలన తిరిగి కొనసాగిస్తున్నారని విమర్శించారు.దీనినే పునర్నిర్మాణం అనే భావనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. వందల ఎకరాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు గడీల తరహా ఫామ్ హౌస్ లను కట్టి భూ దందాలు సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కృష్ణ గోదారి జలాల నుండి ఒక్క ఆయకట్టుకు నీరు అందించిన పాపాన ఈ సర్కార్ పోలేదని విమర్శించారు . కాలేశ్వరం ప్రాజెక్టు పై కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాలేశ్వరం ద్వారా అదనంగా ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా కాలేశ్వరం కింద బ్రాంచ్ కెనాల్, పంట కాలవలు తీశారా, బ్రాంచ్ కెనాల్స్ డిస్ట్రిబ్యూటర్స్ కెనాల్ లేకుండా ఎక్కడ ఏ గ్రామానికి నీరు ఇచ్చారు అప్పనంగా అడ్డంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రచార ఆర్పాటాలతో 45 లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కాగ్ కూడా కాలేశ్వరం ప్రాజెక్టు విధానాలను తప్పు పట్టిందని అన్నారు. ఒక్క ఎకరానికి నీరు ఇవ్వకుండా 80 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నారని అన్నారు. ఏ నీళ్ళ కోసం అయితే రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ నీళ్లు రాకుండా చేస్తున్నారని దూషించారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి ప్రజలకు అందించాల్సిన అవసరం ఉన్నా కూడా ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని అన్నారు.

విలేకరుల సమావేశ అనంతరం ఖమ్మం మార్కెట్ కమిటీ ఎక్స్ వైస్ చైర్మన్ మడుపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో భట్టి విక్రమార్కను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,TPCC ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరావు,పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరావు,వడ్డే నారాయణరావు,పుచ్చాకాయల వీరబద్రం,రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ నాయకులు దాసరి దానియల్, పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కన్వీనర్ బుల్లెట్ బాబు,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య,జిల్లా కాంగ్రెస్ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి,జిల్లా మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్,వనం బాబు,మద్ది వీరారెడ్డి,బోనకల్ జడ్పీటీసీ మోదుగు సుధీర్ బాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యర్రం బాలగంగాధర్ తిలక్,కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు,దుద్ధుకూరి వెంకటేశ్వర్లు,మిక్కిలినేని మంజుల తదితరులు పాల్గొన్నారు .

Related posts

తమిళనాడు ఆదివాసీలతో కాలుకదిపిన రాహుల్ గాంధీ.. వీడియో ఇదిగో!

Ram Narayana

బీజేపీపై కేటీఆర్ ఆగ్రహం!

Drukpadam

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి!

Drukpadam

Leave a Comment