బీజేపీలో గందరగోళం…కొత్తగా వచ్చిన వారిని నిలబెట్టుకునేందుకు పదవుల పందారం …
బీజేపీలో వరస పదవులు …నిన్న కిషన్ రెడ్డి ,ఈటెల , నేడు రాజగోపాల్ రెడ్డిలకు పార్టీల పదవులు
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియామకం
పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు
రాజగోపాల్ రెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి
అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిష్ఠానం కీలక నిర్ణయాలు
తెలంగాణ రాష్ట్ర బీజేపీలో గందరగోళం నెలకొన్నదా….? అంటే అవుననే సమాధానమే ఠక్కున వస్తుంది . అందుకు కారణం లేకపోలేదు…అధికారంలోకి వస్తామన్న పార్టీ ఎప్పుడు ఎన్ని సీట్లు వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీలో ఉన్న వాళ్ళను జారిపోకుండా చూసుకునే చర్యలను చేపట్టారు . అందులో భాగంగానే వరస పదవులతో పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది …
తెలంగాణ తో పాటు మరో మూడు రాష్ట్రాల్లో అద్యక్షలను మార్చారు . మరి కొద్దీ నెలల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణ లో వరస పదవులతో కొత్తగా వచ్చిన వారిని కాపాడుకొని పనిలో బీజేపీ నిమగ్నమైంది . సిద్ధాంతం నిబద్దత గల పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీకి
గత ఏడాది కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చి, మునుగోడు ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదారు నెలల గడవు మాత్రమే ఉంది. ఈ సమయంలో పార్టీ అధిష్ఠానం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్ రెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. నిన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ను అధిష్ఠానం నియమించింది.