తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

ప్యాకేజీలపై రేణుకాచౌదరి సెటైర్లు …ఎవరు ఇస్తున్నారంటూ ఎదురు ప్రశ్న…

ప్యాకేజీలపై రేణుకాచౌదరి సెటైర్లు …ఎవరు ఇస్తున్నారంటూ ఎదురు ప్రశ్న…
షర్మిల ఖమ్మం జిల్లాకే ఎందుకు వస్తున్నారన్న రేణుకాచౌదరి
తాను ఎక్కడ నుంచి పోటీచేసేది పార్టీ నిర్ణయిస్తుంది
తాను ఖమ్మం సెలక్ట్ చేసుకోలేదు …పార్టీనే పంపిందని వివరణ
తనకు గుడివాడ నుంచి పోటీచేయమని ఆఫర్లు ఉన్నాయన్న రేణుక చౌదరి
కాంగ్రెస్ గంగా నది లాంటిది… ఎంతో మంది వచ్చి పునీతులవుతున్నారు:
కేసీఆర్‌, కేటీఆర్ మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదన్న రేణుకా చౌదరి
సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఇద్దరూ ఒక్కటేనని విమర్శ

ప్యాకేజీలపై కేంద్రమాజీమంత్రి రేణుక చౌదరి తనదైన శైలిలో సెటైర్లు వేశారు .ఖమ్మం లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీజేపీ ,బీఆర్ యస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు .ప్రధాని మోడీ , సీఎం కేసీఆర్ కు రహస్య అవగానే ఉందని ఆరోపించారు . పైకి ప్రత్యర్థులుగా నటిస్తూనే రాజకీయ స్నేహం కొనసాగిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు . బీజేపీ దేశాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ ఐక్యం చేయడానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు . కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. సర్వే నివేదికల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు.

ఈసందర్భంగా మీడియా ప్రతినిధులు రేణుక చౌదరి ప్యాకేజీలకోసమే జిల్లాలో పర్యటనలు చేస్తున్నారని ప్రశ్నించగా పెద్ద నవ్వుతు ,ఎవరు ఇస్తున్నారు ప్యాకేజీ ,నాదగ్గర డబ్బులు లేవు బాబు ….ఎవరు ఇస్తున్నారో చెప్పి ఇప్పించడని అన్నారు.పొంగులేటి కి మీకు సయోధ్యఎలా కుదిరిందని ప్రశ్నించగా ,మామధ్య విభేదాలు ఎప్పుడు ఉన్నాయని అన్నారు . కొందరి కి సీట్లు ఇప్పిస్తామని కొందరు సీట్ల కోసం డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలపై ఆమె స్పందిస్తూ ఎవరు ఎన్ని చెప్పిన సర్వే ల ప్రకారం సీట్లు కేటాయింపులు ఉంటాయి తప్ప ఎలా పడితే ఆలా సీట్లు ఇవ్వరని ఇవ్వరని అన్నారు .

షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం పై

షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం పై ప్రశ్నించగా విలీనం గురించి తనకు తెలియదని చెపుతూనే ఆమె ఏపీ లో రాజకీయాలు చేయవచ్చు కదా …? ఇక్కడకు ఎందుకు వస్తుందో మీడియా వాళ్ళు అడగాలని అన్నారు .మీరు ఖమ్మం ఎందుకు వచ్చారని మీడియా ప్రశ్నించగా నేను రాలేదు పార్టీనే నన్ను ఇక్కడకు పంపించింది …ఖమ్మం ప్రజలు నన్ను ఆడబిడ్డగా ఆదరించారని తెలిపారు .మీరు ఎమ్మెల్యేగానే , ఎంపీగానే దేనికి పోటీచేస్తారు .ఎక్కడ నుంచి పోటీచేస్తారు అని అడగ్గా అది తన చేతిలో లేదని పార్టీ ఎక్కడ ,దేనికి పోటీచేయమంటే దానికి చేస్తానని అన్నారు . తనను గుడివాడ రమ్మని అక్కడి వాళ్ళు అడుగుతున్నారని పార్టీ ఏది చేయమంటే అది చేస్తానని అన్నారు . మీరు ఎన్నికలప్పుడే ఖమ్మం కు వస్తున్నారనే విమర్శలపై స్పందిస్తూ ఇది పూర్తిగా నిరాధారం అని , చాలాసార్లు వచ్చాను .ఇక్కడే నా క్యాంపు కార్యాలయం ఉందన్నారు . ఎప్పుడు నా అవసరం వచ్చిన క్షణాల్లో వాలిపోతున్నాను అంటూ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు .

మోడీ …కేసీఆర్ ఒక్కటే …కేంద్ర కూడా ముందస్తు కు అవకాశం …

సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఇద్దరూ ఒక్కటేనని రేణుకా చౌదరి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ గంగా నది లాంటిదని, ఇందులోకి ఎంతో మంది వచ్చి స్నానం చేసి పునీతులవుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో వ్యవస్థలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కేటీఆర్, కేసీఆర్‌ల మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. మంత్రి హరీశ్‌ రావు టీవీ సీరియల్స్ రాసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని ఎద్దేవా చేశారు.

కేంద్రం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోందని చెప్పారు. బీజేపీ ఉత్తరాదిన వంద సీట్లకుపైగా కోల్పోబోతోందన్నారు. బీజేపీ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతోందని, మతతత్వ రాజకీయాలకు ఈ దేశంలో చోటు లేదన్నారు. పార్లమెంట్‌లో అసభ్యంగా, అసహ్యంగా ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతున్నారని రేణుకా చౌదరి మోడీపై ధ్వజమెత్తారు . మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు . …కేసీఆర్ ఒక్కటే …కేంద్ర కూడా ముందస్తు కు అవకాశం …

సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఇద్దరూ ఒక్కటేనని రేణుకా చౌదరి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ గంగా నది లాంటిదని, ఇందులోకి ఎంతో మంది వచ్చి స్నానం చేసి పునీతులవుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో వ్యవస్థలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కేటీఆర్, కేసీఆర్‌ల మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. మంత్రి హరీశ్‌ రావు టీవీ సీరియల్స్ రాసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని ఎద్దేవా చేశారు.

కేంద్రం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోందని చెప్పారు. బీజేపీ ఉత్తరాదిన వంద సీట్లకుపైగా కోల్పోబోతోందన్నారు. బీజేపీ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతోందని, మతతత్వ రాజకీయాలకు ఈ దేశంలో చోటు లేదన్నారు. పార్లమెంట్‌లో అసభ్యంగా, అసహ్యంగా ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతున్నారని రేణుకా చౌదరి మోడీపై ధ్వజమెత్తారు . మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు .

Related posts

టీఆర్ఎస్ పై ప్రధాని ఫైర్ – తెలంగాణలో బీజేపీదే అధికారం అంటూ ధీమా !

Drukpadam

కాంగ్రెస్-శివసేన బంధానికి బ్రేక్ లు పడతాయా ?

Drukpadam

కర్ర సాయంతో మెల్లిగా నడుస్తోన్న కేసీఆర్… !

Ram Narayana