ప్రవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి
విద్యారంగం పట్ల పాలకుల నిర్లక్ష్యంపై వామపక్ష విద్యార్ధి సంఘాల మండిపాటు …
ప్రవేట్ విద్యాసంస్థల్లో ఫిజీల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలనీ డిమాండ్ …
రాష్ట్రంలో ఉన్న 17500 ఖాళీగా ఉన్న పోస్ట్ లు భర్తీ చేయాలి
ప్రభుత్వ కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ ,నాన్–టీచింగ్ పోస్ట్ లు భర్తీ చేయాలి …
ఫీజులతోపాటు ఇతర కార్యక్రమాల పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టాలి
ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజులును నియంత్రించాలని ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 12న విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు స్థానిక ఖమ్మం నగరంలోని గిరి ప్రసాద్ భవన్ లో ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ సన్నాహక సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికాల రామకృష్ణ ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు తుడుం ప్రవీణ్ పీడీ ఎస్ యూ జిల్లా కార్యదర్శి వంగూరి వెంకటేష్ పీడీ ఎస్ యూ యూజిల్లా కార్యదర్శి మస్తాన్ లు మాట్లాడుతూ
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 17,5 00 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి ప్రభుత్వ కళాశాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టాలని అన్నారు విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ చూపించడం లేదని విమర్శించారు కార్పొరేట్ విద్యాసంస్థల మీదున్న ప్రేమ ప్రభుత్వానికి ప్రభుత్వ విద్యాసంస్థల మీద లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు అనుమతులు లేకుండా నడుస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వం లాలూచీ విధానానికి నిదర్శనం అన్నారు .ఎవరికివారు ఇష్టానుసారంగా వారికి నచ్చిన విధంగా ఫీజులు నిర్ణయించుకొని విద్యార్థుల నుండి మొక్కుపిండి వసూలు చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు పాఠశాలలో వ్యాపార కేంద్రాలుగా మార్చుకొని స్టేషనరీ సైతం తమ పాఠశాలలోనే విక్రయిస్తూ విద్యావ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల తీరు కనిపిస్తుందన్నారు డొనేషన్ల పేరుతో పాటు ఫీజులు అధికంగా వసూలు చేయడంతో పాటు యూనిఫాంలో పుస్తకాలు తమ వద్ద కొనుగోలు చేయాలంటూ తల్లితండ్రులపై ఒత్తిడి చేస్తున్నారని వారు ఆరోపించారు.12న జరిగే బందుకు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థి తల్లిదండ్రులు బంద్ కు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎస్ ఎఫ్ ,ఎస్ ఎస్ ఐ , పిడి ఎస్ యూ నాయకులు సందీప్ ,చందులాల్ లక్ష్మణ్, వీరేందర్ కరుణ్ రవి సాయి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు