జలగం వెంకట్రావు గుంభనం వెనక మర్మమేమిటి …?
–జనవరి 18 ఖమ్మం బీఆర్ యస్ సభలో కనిపించిన జలగం
–తర్వాత కొత్తగూడెం ,సత్తుపల్లి నియోజకవర్గాల్లో పర్యటన
–బీఆర్ యస్ కనికరిస్తుందా …”చేయి” స్తుందా.. !
–ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు
జలగం వెంకట్రావు మాజీ శాసనసభ్యులు… 2004 లో సత్తుపల్లి నుంచి , 2014 లో కొత్తగూడెం నుంచి విజయబావుటా ఎగర వేశారు . మొదట కాంగ్రెస్ పార్టీ తరుపున తరువాత టీఆర్ యస్ నుంచి గెలిచారు . తిరిగి కొత్తగూడెం నుంచి పోటీచేయాలనే ప్రయత్నంలో ఉన్నారు . కొద్దికాలంగా ఆయన గుంభనంగా ఉన్నారు . దాని వెనక ఉన్న మర్మమేమిటి అనేది చర్చనీయాంశంగా మారింది. ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారని ప్రచారం జరిగింది . బీజేపీ నేతలు ఆయన్ను సంప్రదించారని సమాచారం . అయితే ఆయన యస్ అని గానీ నో అని గానీ వారికీ చెప్పలేదని తెలుస్తుంది.
అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది …గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి విజయం సాధించిన వనమా వెంకటేశ్వరావు కొద్దీ కాలానికే అధికార టీఆర్ యస్ తీర్ధం పుచ్చుకున్నారు . దీంతో నియోజకవర్గ భాద్యతలు ఎమ్మెల్యే వనమా కే సీఎం అప్పగించారు .
ఫలితంగా సహజంగానే జలగం నియోజకవర్గంలో పట్టులేకుండా పోయారు .అయితే ఆయన్ను నమ్ముకున్న కొంతమంది ఇంకా ఆయన నిర్ణయంకోసం ఎదురు చూస్తున్నారు . నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత వెంకట్రావు అప్పుడపుడు వస్తూ కార్యకర్తలను కలుస్తున్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు .
ఖమ్మం బీఆర్ యస్ బహిరంగ సభలో మెరిసిన జలగం ….
చాలాకాలం పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దురుంగా ఉంటున్నజలగం వెంకట్రావు ఖమ్మం లో జరిగిన బీఆర్ యస్ బహిరంగ సభలో మెరిశారు .దీంతో మళ్ళీ వెంకట్రావు గులాబీ పార్టీలో యాక్టీవ్ అవుతున్నారని పరిశీలకులు భావించారు . కొత్తగూడెం సీటు కూడా ఆయనకే అనుకున్నారు . కొద్దిరోజుల తర్వాత ఆయన కొత్తగూడెం , సత్తుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించి తన అనుయాయులను కలుసు కున్నారు . ఈసందర్భంగా వారితో రాజకీయ ప్రస్థానాన్ని గురించి వారి అభిప్రాయాలు కూడా తీసుకున్నారని ప్రచారం జరిగింది.
ఇప్పుడు …
ఎన్నికలు సమీపిస్తున్నాయి…. ఆశావహులు తమ సీటు కన్ఫర్మ్ చేసుకునేందుకు అధినేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు . వెంకట్రావు ఎక్కడ కనిపించడం లేదు .ఆయనకు అతివిశ్వాసం అని కొందరు అంటారు .ఆయనకు ఎక్కడో నమ్మకం ఉంది .కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి . ఇదే విషయాన్నీ ఆయన్ను అడిగితె వెయిట్ అండ్ సీ అంటారు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి మంచి అడ్మినిస్ట్రేటర్ గా గుర్తింపు పొందిన జలగం వెంగళరావు తనయుడైన వెంకట్రావు కు మంచి పేరే ఉంది. వెంగళరావు కూడా జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు .ఇప్పటికి ఆయన చేసిన మంచి పనులు జిల్లా ప్రజలు చర్చించుకుంటారు .
తండ్రి లాగానే వెంకట్రావుకు కూడా ప్రజల సమస్యలను పరిష్కరానికి ప్రత్యేక చొరవ చూపేవారనే పేరు ఉంది. కొత్తగూడెం భద్రాద్రి జిల్లా కేంద్రంగా కొత్తగూడెం ను ఏర్పాటు చేసినసందర్భంలో ఆయనే ఎమ్మెల్యేగా ఉన్నారు. నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మాణానికి పునాదులు వేశారు. జిల్లా కేంద్ర అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో రోడ్లు వెడల్పు డివైడర్లు ఏర్పాటులో క్రియాశీలంగా వ్యహరించారు . కొత్తగూడం విమాశ్రయానికి చొరవ చూపారు . జిల్లా పార్టీ కార్యాలయం , జిల్లా కేంద్రానికి తగ్గట్లుగా మౌలిక వసతుల సదుపాయం కోసం ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపారు .
వైద్య సమస్యలు ,విద్యాసమస్యలపై గ్రామా మండల సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలు గురించి ,నియోజకవర్గ ప్రజలు వచ్చి చెపితే వారి పరిస్కారం కోసం వెంటనే అధికారులతో సంప్రదించి వెంటనే వాటికీ పరిస్కారం చూపించేవారు . అది హైద్రాబాద్ లో ఉన్న సమస్య అయినా వారి సమస్యలు ప్రత్యేకంగా నోట్ చేసుకొని వాళ్ళు వస్తామన్నా మీరెందుకు డబ్బులు దండగ మీకు వేరే పనులు హైద్రాబాద్ లో ఉంటె రండి తప్ప వీటికోసం అయితేరాకండి అని చెప్పి వారి సమస్య పరిస్కారం కోసం సంబంధిత అధికారులను కలిసి వారికి వివరించి పని సక్సెస్ చేసుకొని వచ్చేవారు …
మరి అలాంటి జలగం రాజకీయ భవిష్యత్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది…