Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీడీపీ పొత్తుకు బీజేపీ పచ్చజెండా …బీజేపీనేత ఆదినారాయణ రెడ్డి…

టీడీపీ పొత్తుకు బీజేపీ పచ్చజెండా …బీజేపీనేత ఆదినారాయణ రెడ్డి…
జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులపై ఆదినారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు
వైసీపీ దుర్మార్గపు పాలనను అంతమొందించాల్సి ఉందని వ్యాఖ్య
అధిష్ఠానం నుండి సంకేతాలున్నాయన్న ఆదినారాయణ
వైఎస్ జగన్ కు సీబీఐ కేసులో అండగా ఉందనే ప్రచారాన్ని కొట్టిపారేసిన మాజీ మంత్రి

2024 జరగనున్న ఎన్నిలకల్లో టీడీపీతో కలిసి పోటీచేసేందుకు తమపార్టీ పచ్చజెండా ఊపింది ఆపార్టీ నేత ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు తమపార్టీ క్లిరియర్ కట్ సంకేతాలు ఉన్నందునే తాను మాట్లాడుతున్నానని ఆయన అన్నారు .టీడీపీ కూడా బీజేపీతో కలిసి పోటీచేయాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది.అయితే ఇప్పటివరకు కుటుంబ పార్టీలతో తమపార్టీకి పొత్తు ఉండదని ఇప్పటివరకు చెపుతూవస్తున్న బీజేపీ నేతలు ఇప్పడు ఏమి చెపుతారనేది ఆసక్తి మారింది .

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ పొత్తులతోనే ముందుకు సాగుతుందని బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి గురువారం అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి సాగుతాయని, పొత్తు దిశగా ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. వైసీపీ దుర్మార్గపు పాలనను అంతమొందించాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ మూడు పార్టీలు కలుస్తాయన్నారు. ఈ పొత్తుకు తమ పార్టీ అధిష్ఠానం కూడా పచ్చజెండా ఊపిందన్నారు.

ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని, అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి నారాయణస్వామి కూడా ఇటీవల పొత్తులపై మాట్లాడారన్నారు. పార్టీ అధిష్ఠానం సంకేతాలు ఉంటేనే తాను ఈ అంశంపై మాట్లాడుతానని లేదంటే మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పారు. తమకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు. సీబీఐ కేసులలో వైఎస్ జగన్ కు కేంద్రం అండదండలు ఉన్నాయనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అదంతా అపోహ మాత్రమే అన్నారు.

Related posts

దేశంలోనే తొలిసారి.. సీఎం అభ్యర్థిని మీరే ఎన్నుకోండంటూ ప్రజలకు ఫోన్ నంబర్ చెప్పిన కేజ్రీవాల్!

Drukpadam

జులై 7న పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకారం…

Drukpadam

ఈటల దారెటు … పార్టీ పెడతారా పార్టీలో చేరతారా ?

Drukpadam

Leave a Comment