జాతీయ రాజకీయ వార్తలు

మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థిగా సువేందు అధికారి పోటీ…!

పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ అభ్యర్థిగా ప్రతిపక్ష నేత సువేందు అధికారి పోటీ చేయనున్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పోటీ చేసే తమ అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. కోల్‌కతా నడిబొడ్డున ఉన్న భవానీపూర్ నియోజకవర్గం నుంచి సువేందు పోటీ చేయనున్నారు. 2011 నుంచి ఈ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీయే విజయం సాధిస్తూ వస్తోంది.

అటు, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ 47 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నేమమ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మరో కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్‌కు తొలి జాబితాలో చోటు దక్కింది. గత లోక్ సభ ఉప ఎన్నికలో వయనాడ్‌లో ప్రియాంక గాంధీపై పోటీ చేసిన నవ్య హరిదాస్ ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.

Related posts

ముందు మీ అవినీతి చూసుకోండని కేసీఆర్ పై మధ్యప్రదేశ్ సీఎం చౌవాన్ ఫైర్ …

Ram Narayana

రాజీవ్ గాంధీ కేంబ్రిడ్జిలో ఫెయిల్ అయ్యాడు: మణిశంకర్ అయ్యర్ తీవ్ర వ్యాఖ్యలు!

Ram Narayana

నితీశ్ కుమార్‌ను ఉపప్రధానిగా చూడాలనుకుంటున్నాను: కేంద్ర మాజీ మంత్రి!

Ram Narayana