Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తణుకు సభలో సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ తిట్ల దండకం …

నువ్వు శివశివాని స్కూల్లో 10వ తరగతి పేపర్లు కొట్టేసిన వాడివి జగన్: పవన్ కల్యాణ్..

  • తణుకు సభలో సీఎం జగన్ పై పవన్ ఫైర్
  • నువ్వు దొంగవి జగన్ అంటూ వ్యాఖ్యలు
  • అందుకే నిన్ను జగ్గుభాయ్ అంటామని వెల్లడి
  • వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే జగ్గు అని పిలుస్తానని స్పష్టీకరణ

తణుకు సభలో జనసేనాని పవన్ కల్యాణ్ సీఎం జగన్ ను టార్గెట్ చేశారు. నువ్వు దొంగవి జగన్… అందుకే నిన్ను జగ్గుభాయ్ అంటాం అని ఎద్దేవా చేశారు. శివశివాని స్కూల్లో 10వ తరగతి పేపర్లు కొట్టేశావు కదా జగన్ అని వ్యంగ్యం ప్రదర్శించారు.

నేను జగన్ అని ఏకవచనంలో పిలుస్తుంటే వైసీపీ నేతలు ఫీలవుతున్నారు… మరి నన్ను దత్తపుత్రుడు, ప్యాకేజి స్టార్ అంటున్నప్పుడు ఏమయ్యారు? మీ నీతులు అప్పుడెందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే నేను కూడా నోరు అదుపులో పెట్టుకుంటా అని స్పష్టం చేశారు. ప్రస్తుతం జగన్ నుంచి జగ్గుభాయ్ కి వచ్చాను… ఇంకా మీరు నోరు జారితే జగ్గు అంటాను… ఆ తర్వాత ఏమని పిలుస్తానో తెలియదు అంటూ పవన్ వ్యాఖ్యానించారు.

పవన్ వ్యాఖ్యలలో కొన్ని…

  • ఈ పెద్దమనిషి జగన్ అన్నవరంలో పురోహితులను వేలం వేశాడు. ఇతర మతాల్లో ఇలా వేలం వేస్తారా? కేవలం హిందూ ధర్మాన్నే ఎందుకు ఇలా చేస్తున్నారు? నిస్సందేహంగా ఇది హిందూ మతాన్ని దెబ్బతీయడమే.
  • ఎక్కడైనా ఆలయాల్లో ప్రసాదాలు, శిరోముండనం, కొబ్బరికాయలు, చెప్పుల స్టాండ్ వేలం వేస్తారు… ఇలా పురోహితులను వేలం వేయరు జగన్. ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యపై జనసేన పార్టీ కోర్టును ఆశ్రయిస్తుంది.
  • అసలు, మేం ఎలా బతకాలో చెప్పేందుకు నువ్వెవడివి, నీ మంత్రులెవరు జగన్? కంకర కొనుక్కోవాలన్నా వైసీపీ ఎర్రిపప్పలకు డబ్బులు ఇవ్వాలా?
  • ప్రస్తుతం మీరు నడుపుతున్న బైరైటిస్ గనులు బలిజలవి కావా… వారి నుంచి మీరు లాక్కోలేదా?
  • జగన్… నువ్వు దిశా యాప్ అంటుంటావు కదా… నీ పాలనలో 3,378 మంది మహిళలు మానభంగాలకు గురయ్యారు తెలుసా?
  • మిస్సింగ్ కేసుల వాళ్లు తిరిగొచ్చారని మీరు చెబుతున్నారు… వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో తిరిగొచ్చారో కనుక్కున్నావా జగన్?

Related posts

తాను బీకాం చదవలేదని అశోక్ బాబు స్వయంగా చెప్పారు: విజయసాయిరెడ్డి

Drukpadam

పవన్ విమర్శలు నిజమా….?కాకపోతే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదు ..!

Drukpadam

సత్తుపల్లి సభ సాక్షిగా కలిసిన నాయకులు…కలవని మనసులు …

Drukpadam

Leave a Comment