Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఫ్రాన్స్ అధ్యక్ష భవనానికి పార్శిల్… విప్పి చూస్తే…!

ఫ్రాన్స్ అధ్యక్ష భవనానికి పార్శిల్… విప్పి చూస్తే…!

  • ఎలిసీ ప్యాలెస్ కు తెగిన వేలుతో కూడిన పార్శిల్
  • విప్పి చూసి హడలిపోయిన అధికారులు
  • మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి ఈ ప్యాకెట్ పంపి ఉంటాడని అనుమానం
  • ఇటీవల ఫ్రాన్స్ లో విస్తృత స్థాయిలో అల్లర్లు
  • ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు ముందు ఓ అవాంఛనీయ పరిణామం చోటుచేసుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అధికారిక నివాసం ఎలిసీ ప్యాలెస్ కు ఓ పార్శిల్ రాగా, విప్పి చూసిన అధికారులు బెంబేలెత్తిపోయారు. అందులో ఓ తెగిన వేలు ఉండడమే అందుకు కారణం. ఈ విషయాన్ని పారిస్ ప్రాసిక్యూషన్ విభాగం నిర్ధారించినట్టు తెలుస్తోంది.

ఇటీవల ఫ్రాన్స్ లో అరాచక పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఓ టీనేజి కుర్రాడు మరణించాడు. ఫ్రాన్స్ లో రోజుల తరబడి హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే మేక్రాన్ అధికారిక నివాసానికి తెగిన వేలుతో కూడిన పార్శిల్ వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. కాగా, మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి తన వేలును తానే కోసుకుని, దాన్ని మేక్రాన్ కు పంపినట్టు ప్రాసిక్యూషన్ విభాగం భావిస్తోంది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

Related posts

అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఓ భారతీయ కుటుంబం మృత్యువాత!

Drukpadam

తీన్మార్ మల్లన్నఫై ‘హత్యాయత్నం’ వార్తల పట్ల స్పందించిన జైలు అధికారులు!

Drukpadam

ప్రకాశం జిల్లాలో ఎస్ ఐ ,రెవెన్యూ అధికారి ఫారెన్ టూర్ పై వివాదం ….?

Drukpadam

Leave a Comment