Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

బీఆర్ యస్ లో అంతా గుంభనం…మరికొద్ది రోజుల్లో సీట్ల ప్రకటన అంటూ సంకేతాలు …

బీఆర్ యస్ లో అంతా గుంభనం…మరికొద్ది రోజుల్లో సీట్ల ప్రకటన అంటూ సంకేతాలు …
సీట్టింగ్ ఎమ్మెల్యేల్లో లబ్ డబ్ ..
ఒకవేళ సీటు రాకపోతే ఇప్పటివరకు చేసిన ఖర్చు పై కలవరం
లెఫ్ట్ పొత్తుపై ఎటు తేల్చని కేసీఆర్…పిలుపు కోసం కమ్యూనిస్టుల వెయిటింగ్
తమతో పొత్తులేకపోతే 40 నియోజకవర్గాలపై ప్రభావం ఉందంటున్న లెఫ్ట్ నేతలు
పొత్తుల బంతి బీఆర్ యస్ కోర్ట్ లోనే ఉందని అంటున్న కమ్యూనిస్టులు

నవంబర్ ,డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరిపేందుకు కేంద్రం ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది.దింతో అన్ని రాజకీయపార్టీలు ఎన్నికల మడ్ లోకి వెళ్లిపోయాయి. ఇందులో అధికారంలో ఉన్న బీఆర్ యస్ ముందున్నది …ఇప్పటికే నియోజకవర్గాలవారీగా సీఎం, బీఆర్ యస్ అధినేత కేసీఆర్ అభ్యర్థుల కసరత్తు చేస్తున్నారు . సీట్టింగ్ అభ్యర్థుల పనివిధానం …ప్రజల్లో వారికున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల ఎంపిక పై జరుగుతుందని తెలుస్తుంది . అయితే ఇది అంతా గుంభనంగా జరుగుతుందని సమాచారం …మొత్తం రాష్ట్రం లో ఉన్న 119 నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షించడంతోపాటు వివిధ సర్వే సంస్థల ద్వారా చేయించిన సర్వే లు , ఇంటలిజెన్స్ నివేదికలు ,పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకోని వాటి ఆధారంగా పరిశీలన చేస్తున్నారు . ప్రస్తుతం శాసనసభలో బీఆర్ యస్ కు 108 సీట్లు ఉన్నాయి. మిగతా సీట్లలో 7 గురు ఎంఐఎం 5 గురు కాంగ్రెస్ ,ముగ్గురు బీజేపీ సభ్యులు ఉన్నారు.

టీఆర్ యస్ నుంచి బీఆర్ యస్ గా మారినతరువాత జరుగుతున్న మొదటి ఎన్నికలు అయినందున కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు .ఈసారి ఎన్నికల్లో 30 మందికి పైగానే కొత్తవారికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఈవిషయాన్ని సంవత్సరం క్రితమే పంచాతిరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. దానిపై పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు . ఒక సందర్భంలో చాలామంది ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉందని 40 మందికి పైగా మార్పులకు అవకాశం ఉందని ప్రచారం జరిగింది. దీంతో సీట్టింగ్ ల్లో చాలామందికి లబ్ డబ్ అంటూ గుండెలు కొట్టుకోవడం ప్రారంభమైంది. కొన్ని నియోజకవర్గాల్లో సీట్టింగ్ లు ఉన్న ఇద్దరు ముగ్గురు సీటు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు .అయితే కేసీఆర్ దగ్గర పప్పులు ఉడకవని తెలిసిన నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తాము పోటీలో ఉంటామని చెపుతున్నారు . కొందరి పనితీరు ఆధారంగా మార్చే అవకాశాలు ఉండటంతో నియోజకవర్గం మీద ఆశలు పెట్టుకొని తాము చేసిన ఖర్చులపై కంగారు పడుతున్నారు .ఈసారి సీటు రాకపోతే కీం కార్త్యవం అనే ఆలోచనలు పడ్డారు .అయితే కేసీఆర్ అభ్యర్థులను ముందే ప్రకటిస్తారని అంటున్నారు . ముందే ప్రకటిస్తే టికెట్ రాని వారు ప్రత్యాన్మాయ మార్గాలు ఎంచుకుంటారు .అందువల్ల పార్టీకి నష్టం జరుగుతుందనే భావన కూడా ఉంది. అందువల్ల టికెట్స్ ప్రకటించే విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు . తప్పని పరిస్థితుల్లో టికెట్స్ ముందుగా ప్రకటించాల్స్ వస్తే గెలుపు గుర్రాలతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేని అభ్యర్హులను ప్రకటించే అవకాశం ఉండవచ్చు …

వామపక్షాలతో పొత్తులపై ఇంకా రాని క్లారిటీ …

ఇక వామపక్షలతో పొత్తుల విషయం ఇంకా క్లారిటీ రాలేదు …సిపిఎం ,సిపిఐ పార్టీలు ఈసారి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేక లైన్ తీసుకోని పోరాడుతున్న బీఆర్ యస్ తో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అయితే బీఆర్ యస్ కు కలిసి కూర్చొని మాట్లాడేందుకు సీఎం కేసీఆర్ సమయం కావాలని కోరాయి. సీఎం సమయం కోసం వామపక్షాలు గత నెలరోజులుగా ఎదురు చూస్తున్నాయి. రెండు పార్టీల జాయింట్ సమావేశంలో కూడా బీఆర్ యస్ తో నే తమ ప్రయాణమని మరోసారి ప్రకటించాయి. కానీ బీఆర్ యస్ వైపు నుంచి చూద్దాం మాట్లాడదాం అంటూ సాగదీస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. బీఆర్ యస్ కు లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీచేసే ఉద్దేశ్యం లేదని కొందరు బీఆర్ యస్ నేతలు అంటున్నారు.దీనిపై లెఫ్ట్ నేతల అభిప్రాయం కోరగా తమతో బీఆర్ యస్ కలవకపోతే తమకన్నా బీఆర్ యస్ కే ఎక్కువ నష్టం జరుగుతుందని ,ఖమ్మం ,నల్లగొండ లాంటి జిల్లాలో బీఆర్ యస్ ఒక్క సీటు కూడా గెలవదని అంటున్నారు .తమ ప్రభావం రాష్ట్రంలోని 40 నియోజకవర్గాలపై ఉంటుందని తాము వారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని, పొత్తుల బంతి బీఆర్ యస్ కోర్టులో ఉందని అంటున్నారు . బీఆర్ యస్ వైఖరి ఎలా  ఉంటుందో చూడాలి మరి …!

Related posts

హైదరాబాద్‌కు అఖిలేశ్ యాదవ్, సీఎం కేసీఆర్‌తో భేటీ…!

Drukpadam

కేసీఆర్ కు సీఎంగా ఉండే అర్హతలేదు: ఉత్తమ్ కుమార్…

Drukpadam

యాదవులను క్షమాపణలు కోరిన సీపీఐ నారాయణ!

Drukpadam

Leave a Comment