Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

నెల రోజుల్లో కోటీశ్వరుడిగా మారిన మహారాష్ట్ర టమాటా రైతు…!

నెల రోజుల్లో కోటీశ్వరుడిగా మారిన మహారాష్ట్ర టమాటా రైతు…!

  • ఒక్క రోజే రూ. 18 లక్షలు ఆర్జించిన పూణె రైతు
  • నెల రోజుల్లో రూ. 1.5 కోట్ల సంపాదన
  • టమాటా సాగుపై పడిన ‘మహా’ రైతులు

దేశవ్యాప్తంగా పెరిగిన టమాటా ధరలు మహారాష్ట్ర రైతును కోటీశ్వరుడిని చేశాయి. పూణె జిల్లాకు చెందిన తుకారామ్ భాగోజీ గయాకర్ టమాటా రైతు. ధరలు పెరిగిన తర్వాత గత నెలరోజుల్లో 13 వేల క్రేట్ల టమాటాలు విక్రయించడం ద్వారా ఏకంగా రూ. 1.5 కోట్లు ఆర్జించాడు. అతడికున్న 18 ఎకరాల భూమిలో 12 ఎకరాల్లో టమాటాలు సాగుచేస్తున్నాడు. ఇప్పుడు ధరల పెరుగుదల అతడికి కలిసొచ్చింది.

నారాయణ్‌గంజ్ మార్కెట్లో ఒక్క క్రేట్ టమాటాలను రూ. 2,100కు విక్రయించాడు. శుక్రవారం 900 క్రేట్ల టమాటాలు విక్రయించడం ద్వారా ఒక్క రోజే రూ. 18 లక్షలు సంపాదించాడు. గత నెలలో ఒక్కో క్రేట్ టమాటాలను రూ. 1000 నుంచి రూ. 2,400 మధ్య విక్రయించాడు. తుకారామ్ టమాటాల విక్రయం ద్వారా కోటీశ్వరుడిగా మారడంతో జిల్లాలోని జున్నూరు రైతులు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున టమాటాల సాగుకు నడుం బిగించారు.

Related posts

 హిమాలయాల్లో 600 మిలియన్ల ఏళ్ల కిందట మహాసముద్రం… కనుగొన్న భారత్, జపాన్ పరిశోధకులు

Ram Narayana

బ్రిడ్జి నుంచి వేలాడుతూ రైలు ఇంజెన్‌కు రిపేర్.. లోకోపైలట్ల సాహసం!

Ram Narayana

ఎన్నికలకు ముందే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా? అంటే కేంద్రమంత్రి సమాధానం ఇదీ

Ram Narayana

Leave a Comment