Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమెరికాలోని అలాస్కా భూభాగాన్ని కుదిపేసిన భారీ భూకంపం… సునామీ హెచ్చరిక జారీ!

అమెరికాలోని అలాస్కా భూభాగాన్ని కుదిపేసిన భారీ భూకంపం… సునామీ హెచ్చరిక జారీ!

  • 7.4 తీవ్రతతో భారీ భూకంపం
  • శాండ్ పాయింట్ పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం
  • వివరాలు తెలిపిన యూఎస్ జీఎస్

అమెరికాలోని అలాస్కా భూభాగాన్ని శక్తిమంతమైన భూకంపం కుదిపేసింది. శనివారం రాత్రి ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా గుర్తించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) వెల్లడించింది.

రాత్రి 10.48 గంటలకు భూమి తీవ్రంగా కంపించిందని, శాండ్ పాయింట్ అనే చిన్న పట్టణానికి నైరుతి దిశగా 55 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని వివరించింది.

భూకంప తీవ్రత దృష్ట్యా అలాస్కా, అమెరికాలోని ఇతర తీర ప్రాంతాలు, కెనడా, పసిఫిక్ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు  జారీ చేశారు.

అలాస్కా అమెరికాలో అత్యంత శీతలంగా ఉండే ప్రాంతం. ఇక్కడ జనావాసాలు తక్కువ. దాంతో, తాజా భూకంపం కారణంగా ప్రాణనష్టం లేనట్టు తెలుస్తోంది. అయితే, పలు సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగడంతో ప్రజలు హడలిపోయారు. ఇళ్లలోంచి, ఇతర భవనాల్లోంచి బయటకు పరుగులు తీశారు.

అలాస్కాలో 1964లో 9.2 తీవ్రతతో పెను భూకంపం సంభవించగా, ఆ సమయంలో ఎగసిపడిన సునామీ ధాటికి 250 మందికి పైగా మరణించారు.

Related posts

లైంగిక వేధింపుల కేసులో డొనాల్డ్ ట్రంప్‌కు షాక్..

Drukpadam

మునుగోడులో గెలుపు బీజేపీదేనంటున్న మిషన్ ఛాణక్య సర్వే!

Drukpadam

వందే భారత్ రైళ్ల ఆర్డర్‌ను సొంతం చేసుకున్న ‘భెల్’…!

Drukpadam

Leave a Comment