Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ముస్లిం హక్కుల సాధనకు ముస్లిం డిక్లరేషన్ తొలిమెట్టు…స్కై బాబ

ముస్లిం హక్కుల సాధనకు ముస్లిం డిక్లరేషన్ తొలిమెట్టు

తెలంగాణ రాష్ట్ర ముస్లిం డిక్లరేషన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు .

ముస్లింల పాత్రలేని చరిత్ర లేదని , దేశంలో అన్ని రంగాలలో వారి ప్రభావం ఎంతో ఉందని , దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరం పైగా కాలం గడిచిపోతున్న ముస్లింలు దళితుల కన్నా అత్యంత వెనుకబాటు తనానికి గురవటం వెనుక కుట్ర ఉందని , ముస్లిం మైనార్టీల తప్పిదనం కూడా ఒక కారణమని , తమ హక్కుల కోసం గళం విప్పకుండా , ప్రశ్నించకుండా మౌనం వహించటమే కాకుండా రాజ్యాంగబద్ధంగా రావలసిన వాటిని కూడా వదులుకోవాల్సిన స్థితి నుంచి బయటపడాల్సిన అవసరం నెలకొందని , కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ముస్లింల నిర్ణాయక , సంఘటిత శక్తిని మాత్రమే కాకుండా ఒక మార్గం చూపెట్టడం జరిగిందని పలువురు వక్తలు పేర్కొన్నారు . ఆదివారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో సామాజిక ఉద్యమకారుడు షేక్ అబ్దుల్ రెహమాన్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర ముస్లిం డిక్లరేషన్ జరిగిన సభలో పలువురు వక్తలు పాల్గొని ప్రసంగించారు . కవి , రచయిత తెలంగాణ ముస్లిం సంఘాల జాక్ రాష్ట్ర కో- కన్వీనర్ స్కై బాబ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలలో సామాజిక , రాజకీయ చైతన్యం తక్కువని , అందుకే ముస్లిం మైనార్టీలు అభివృద్ధికి దూరంగా ఉన్నారన్నారు . ప్రపంచం ఒక పరీక్ష కేంద్రం , మనం ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత చెందాలంటే అన్ని రంగాలలో పోటీ పడాల్సిందేనని పేర్కొన్నారు . దేశంలో ముస్లింల పై విషం చిమ్మ పడుతొందని , ఇది మునుముందు ఏ స్థితికి చేరుకుంటుందో అని ఆందోళన వ్యక్తం చేశారు . పద్యంలో ముస్లింలు అన్ని పార్టీలను అన్ని సంఘాలను కలుపుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు .రాష్ట్రంలో ముస్లింల పాత్రలేని చరిత్ర లేదని , అన్ని రంగాలలో వారి ప్రభావం ఎంతో ఉందని అన్నారు . అయినప్పటికీ వారు దళితుల కన్నా అణగారిన వర్గాల గా మగ్గిపోతున్నారు ? దీని వెనుక ఒక కుట్ర ఉందని సమస్యలపై గళం విప్పకుండా ప్రశ్నించకుండా మౌనం వహించడం కూడా ఒక కారణమన్నారు . కర్ణాటక ఎన్నికలు ముస్లింల సంఘటితం గురించి , వారి నిర్ణయాత్మ కా శక్తిని దేశవ్యాప్తంగా గల ముస్లింలలో ఆలోచన ఒక మార్గాన్ని నిర్దేశించిందని అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ముస్లిం డిక్లరేషన్ ఆవిర్భవించడం జరిగిందన్నారు . ముస్లిం సామాజిక ఉద్యమకారిణి ఖాలిదా పర్వీన్ మాట్లాడుతూ ఇంతకాలం కథలు చెప్తుంటే వింటూ వచ్చాం , ఇక కథలకు కాలం చెల్లింది… ప్రతి గొడవ , ప్రతి ఘర్షణ ప్రతి కష్టం , ప్రతి నష్టం వెనుక ముస్లిం సముదాయం బాధలు , కన్నీళ్ళ నేపథ్యంలో దశాబ్దల మధన చేయగా అందులో పరిష్కారం మార్గంగా వచ్చిందే ముస్లిం డిక్లరేషన్ అని తెలిపారు . దేశంలో రాష్ట్రంలో 14 నుంచి 15% గా మనం ఉన్నామని , ఇదేమి తక్కువ సంఖ్యా కాదని.. ప్రతి పార్టీ గెలుపు ఓటమి నీ ముస్లిం ఓటు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు . ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఓటు నమోదు చేసుకోవాలని , అదేవిధంగా ఓటును అమ్ముకోవడం మానుకోవాలని , అధికార పార్టీ బీ ఆర్ ఎస్ ఇచ్చిన హామీలను ఏమాత్రం అమలు చేయలేదని , అందులో ముఖ్యమైనది 12% రిజర్వేషన్ల విషయమని తెలిపారు . బిజెపి మనకేమి చేయదు.. కాబట్టి దాని గురించి మాట్లాడడం అనవసరమన్నారు . మన డిమాండ్లను నెరవేర్చే పార్టీలకు , పార్టీలు మారని నాయకులకు ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు . తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సైదా ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 17 సంవత్సరాల క్రితం ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ప్రకటించినా , దీని ప్రకారం ఒక ఉద్యోగం కూడా రాలేదని , బిసి – ఈ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అధికారులు ఇవ్వకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు . దళితుల బంద్ , బీ సీ ల బంద్ వలె ముస్లింల బంద్ ప్రకటించకుండా ముస్లిం మైనార్టీలకు దావతులకు ఆహ్వానించి , జోల పాడుతున్నారని విమర్శించారు . మనవారు మేలుకోకుండా నిద్రపోతున్నారని వాపోయారు . తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు , తెలంగాణ ముస్లిం సంఘాల జాక్ రాష్ట్ర కన్వీనర్ సలీమ్ పాషా మాట్లాడుతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకు గా చూస్తున్నాయని , రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం నియమించిన సుధీర్ కమిషన్ నివేదికలలో దళితుల కన్నా ముస్లిములు అత్యంత వెనుక బాటుకు గురైన విషయాన్ని స్పష్టం చేస్తూ… వారికి పది నుంచి 12 శాతం రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం గురించి చెప్పిన అమలు కావడం లేదంటే ముస్లిం మైనార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు . తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు 13 శాతం ఉండగా సుమారు 45 నియోజకవర్గాలలో పార్టీల గెలుపు ఓటములను ప్రభావిత పరిచే శక్తిగా ఉన్నారని అన్నారు . తనకన్నా పెద్ద సెక్యులర్ ఎవరూ లేరని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తుంటారని , భారతీయ జనతా పార్టీ నీ విమర్శిస్తుంటే , గంగా , జమున తేహెజిబ్ వంటి మాటల గారడీ మాయ నుంచి ముస్లిం మైనార్టీలు బయటకు రావాలని పిలుపునిచ్చారు . తెలంగాణలో 10 సంవత్సరాల తన పరిపాలన కాలంలో సీఎం కేసీఆర్ ముస్లిం మైనార్టీలకు సముచితమైన ప్రాధాన్యత ఇవ్వలేదని , దశబ్ద కాలం లో ఒక ఎంపీ సీటు , రాజ్యసభ లో అవకాశం కల్పించలేదన్నారు . తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ముస్లిం మైనార్టీలకు సముచితమైన ప్రాధాన్యత దొరుకుతుందని భావించి , ఉద్యమాలలో ఎంతోమంది ముస్లిం మైనార్టీలు ఆసువులు బాసారని పేర్కొన్నారు . కాబట్టి , మన హక్కుల సాధన కోసం ముస్లిం డిక్లరేషన్ ప్రకారం పోరాడాలని పిలుపునిచ్చారు . ముస్లిం సామాజిక విశ్లేషకులు ప్రొఫెసర్ మహమ్మద్ అన్సారీ మాట్లాడుతూ ప్రస్తుత సామాజిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముస్లిం మైనార్టీలు తమ రాజకీయ అవగాహనను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు . ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు 50వేల ఉన్నారని , ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముస్లిం మైనార్టీ కు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాల్సిందిగా కోరుతూ ముస్లిం మైనార్టీలు అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేయాలని సూచించారు . అనంతరం తెలంగాణ రాష్ట్ర ముస్లిం డిక్లరేషన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ సంచారం రాష్ట్ర అద్యక్షులు సైదాఖాన్ , యూ ఐ ఆర్ సి జనరల్ సెక్రెటరీ డాక్టర్ ఖిజ రుల్లా , న్యాయవాది షేక్ .నజీమా లు ప్రసంగించగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోతు బద్రునాయక్ , తెలంగాణ బీసీ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు పెళ్లూరి విజయ్ కుమార్ పాల్గొని సంఘీభావం ప్రకటించ గా , ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు షేక్ షకీల్ , మహమ్మద్ జమీల్ , షేక్ అఫ్జల్ , షేక్ సుభాని , షేక్ చాంద్ , ముస్లిం వికాస సమితి అధ్యక్షులు వసీం ఖాన్ , న్యాయవాది మహమ్మద్ ముదస్సర్ అలీ , ఎల్ హెచ్ పి ఎస్ నాయకులు జంపా నాయక్ , కొటేష్ నాయక్ , ఎంపీచే జిల్లా అధ్యక్షుడు ఖాసిం , ఆర్ఎంపి నజిరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు .

Related posts

సోనియా విజ్ఞ‌ప్తికి ఓకే చెప్పిన‌ ఈడీ… కొత్త తేదీల‌తో జారీ కానున్న‌ స‌మ‌న్లు!

Drukpadam

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు! ధర రూ.1,108 కోట్ల

Drukpadam

పెగాసస్ పై విచారణకు సుప్రీం ఓకే…

Drukpadam

Leave a Comment