Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మోదీ అంత బలవంతుడేమీ కాదు: ఖర్గే

  • మోదీకి బలం ఉంటే ఎన్డీయే సమావేశానికి 30 పార్టీలను ఎందుకు పిలిచారన్న ఖర్గే
  • విపక్షాల కలయికను చూసి బెంబేలెత్తుతున్నారని వ్యాఖ్య
  • ఎన్డీయే సమావేశానికి వస్తున్న పార్టీల పేర్లు చెప్పాలంటూ సవాల్

ప్రధాని నరేంద్ర మోదీ అంత బలవంతుడేమీ కాదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. అంత బలమే ఉంటే, విపక్షాలను ఒంటి చేత్తో ఎదుర్కొనే దమ్ము ఉంటే ఎన్డీయే సమావేశానికి 30 పార్టీలను ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. విపక్షాలు ఏకతాటిపైకి వస్తుండటంతో మోదీ బెంబేలెత్తుతున్నారని… అందుకే పార్టీలను చీలుస్తూ, చీలిక వర్గాలను పోగు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్డీయే సమావేశానికి వస్తున్న పార్టీల పేర్లు చెప్పమనండి అని సవాల్ విసిరారు. ఆ పార్టీలకు ఎన్నికల కమిషన్ రిజిస్ట్రేషన్ ఉందా? అని ప్రశ్నించారు. దేశం కంటే ఏ ఒక్క వ్యక్తి కూడా ఎక్కువ కాదని అన్నారు.

Related posts

వంగవీటి రాధాకు స్వల్ప గుండెపోటు…

Ram Narayana

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. 14 రకాల వంటకాలతో భోజనం!

Drukpadam

ఆన్ లైన్ లో టికెట్స్ విక్రయం వల్ల ఇబ్బంది ఏమిటి ? ఏపీ హై కోర్ట్ !

Drukpadam

Leave a Comment