Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలురాజకీయ వార్తలు

విపక్ష కూటమికి ఇండియా పేరు సూచించిన మమతా …!

విపక్ష కూటమికి ‘ఇండియా’ పేరును ఎవరు సూచించారో తెలుసా? ఈ పేరుకు నితీశ్ కుమార్ ఎందుకు అభ్యంతరం తెలిపారు?

  • యూపీఏ నుంచి INDIAగా మారిన విపక్ష కూటమి పేరు
  • ఈ పేరుపై అభ్యంతరం తెలిపిన నితీశ్ కుమార్
  • ఈ పేరును మమతా బెనర్జీ సూచించాన్న తిరుమలవాసన్

విపక్ష పార్టీల కూటమికి పేరు మారిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు యూపీఏగా ఉన్న కూటమి పేరు ఇప్పుడు INDIAగా మారింది. బెంగళూరులో జరిగిన విపక్షాల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పేరుపై బీహార్ ముఖ్యమంత్రి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. కూటమి పేరును INDIAగా ఎలా పెడతారని ఆయన పశ్నించారట. INDIA, NDA పదాలను పలికినప్పుడు… రెండూ ఒకేలా అనిపిస్తాయని కూడా ఆయన అన్నారట. అయితే మరో నేత ఆయనను కన్విన్స్ చేయడంతో, చివరకు ఆయన కూడా ఓకే చెప్పారట.

మరోవైపు INDIA పేరును పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారట. ఈ విషయాన్ని విడుత్తలై చిరుతైగల్ కట్చి చీఫ్ తిరుమలవాసన్ వెల్లడించారు. ఈ పేరును తొలుత మమత సూచించారని… ఆ తర్వాత దీనిపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని… చివరకు అందరూ ఈ పేరుకు ఆమోదం తెలిపారని అన్నారు.

‘ఇండియా’ కూటమికి ట్యాగ్​లైన్‌గా ‘జీతేగా భారత్​’

  • బెంగళూరులో రెండు రోజుల పాటు ప్రతిపక్ష పార్టీల భేటీ
  • హాజరైన 26 పార్టీల ప్రతినిధులు
  • కూటమి పేరులో భారత్ పేరు ఉండాలని భావించిన పార్టీలు
INDIA alliance gets a new tagline Jeetega Bharat

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఒక్కటవుతున్నాయి. బెంగళూరులో రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో పాల్గొన్న 26 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడ్డాయి. తమ ఫ్రంట్ కు ‘ఇండియా’ అనే పేరును ప్రకటించాయి. ఇండియా అంటే ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్. తాజాగా ఈ కూటమికి ట్యాగ్‌లైన్‌ గా ‘జీతేగా భారత్’ను ఎంచుకున్నాయి. గత రాత్రి జరిగిన చర్చల తర్వాత జీతేగా భారత్ (భారత్ గెలుస్తుంది)పై తుది నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టినప్పుడు కూటమి పేరులో భారత్ అనే పదం ఉండాలని భావించారు. కానీ, అది సాథ్యం కాకపోవడంతో ఇది ట్యాగ్‌లైన్‌లో కనిపించాలని నిర్ణయించుకున్నారు.

Related posts

ఏపీ సీఎం జగన్ ను ఎమ్మెల్యే రోజా కాకాపడుతున్నారా ?

Drukpadam

దళిత బందు పేరిట డబ్బులు వసూలు చేస్తే తాటతీస్తా: సీఎల్పీ నేత భట్టి

Drukpadam

ఢిల్లీ లో ఈటల … కాషాయ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం…

Drukpadam

Leave a Comment