అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్ట్ ల జాబితాలో ఇండియా స్థానం ఎంత? ఎన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు?
- శక్తిమంతమైన పాస్ పోర్ట్ ల జాబితాను విడుదల చేసిన హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్
- 80వ స్థానంలో నిలిచిన ఇండియన్ పాస్ పోర్ట్
- వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ విధానం ద్వారా 57 దేశాలకు వెళ్లే అవకాశం
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్ట్ ల జాబితాను హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండియన్ పాస్ పోర్ట్ 80వ స్థానంలో ఉంది. తాజా జాబితాలో ఇండియా ఐదు స్థానాలు ఎగబాకింది. సెనెగల్, టోగో వంటి దేశాల సరసన నిలిచింది. మన పాస్ పోర్ట్ తో వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్ విధానం ద్వారా శ్రీలంక, జమైకా, రువాండా, థాయిలాండ్, ఇండొనేషియా వంటి 57 దేశాలకు ప్రయాణం చేయవచ్చు. 177 దేశాలకు వెళ్లాలంటే మాత్రం వీసా తప్పనిసరి. ఈ జాబితాలో అమెరికా, చైనా, జపాన్, యూరోపియన్ యూనియన్ దేశాలు, రష్యా తదితర దేశాలు ఉన్నాయి.
మరోవైపు అత్యంత శక్తిమంతమైన పాస్ పోర్ట్ గా సింగపూర్ పాస్ పోర్ట్ తొలి స్థానంలో నిలిచింది. జపాన్ ను అధిగమించి మోస్ట్ పవర్ ఫుల్ వీసాగా అవతరించింది. సింగపూర్ వీసాతో 192 దేశాలకు వీసా లేకుండా వెళ్లిపోవచ్చు. అత్యంత బలహీనమైన వీసాగా ఆఫ్ఘనిస్థాన్ వీసా చిట్ట చివరి స్థానంలో నిలిచింది.