Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

మాజీమంత్రి తుమ్మలకు కీలక పదవి ఇచ్చే అవకాశం ..?

మాజీమంత్రి తుమ్మలకు కీలక పదవి ఇచ్చే అవకాశం ..?
-ఎన్నికల్లో జిల్లా సమన్వయ బాధ్యత తుమ్మలకు ఇస్తారని సమాచారం
-ఉమ్మడి జిల్లాపై పట్టున్న నేతగా తుమ్మల సేవలు ఉపయోగించుకునే దిశగా బీఆర్ యస్ బాస్ ఆలోచనలు
-ఇప్పటికే ఇంఛార్జిగా ఉన్న మంత్రి హరీష్ రావు ,
-మారిన రాజకీయ పరిస్థితిలో తుమ్మల సేవలు అవసరం అంటున్న జిల్లా నేతలు …
-త్వరలో ఆయనకు సముచిత స్థానం దక్కే ఛాన్స్

ఖమ్మం జిల్లాకు చెందిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరావు కు బీఆర్ యస్ లో కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు … జిల్లా రాజకీయాలను తదైనా శైలిలో శాసించి ,అభివృద్ధిని పరుగులు పెట్టించిన తుమ్మల నాగేశ్వరావుకు బీఆర్ యస్ బాస్ కేసీఆర్ కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయసమాచారం …జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితిలో తుమ్మల లాంటి బలమైన నాయకుడు అవసరం ఉందని గుర్తించిన సీఎం కేసీఆర్ ఆయనకు సముచిత స్థానమిచ్చి ఆయన సేవలు ఉపయోగించుకోవాలని ఆలోచనలో ఉన్నారని సమాచారం …జిల్లాలోని బీఆర్ యస్ నేతలు కూడా తుమ్మల సేవలు ఉపయోగించుకోవాలని అధినేతకు తెలిపారని తెలుస్తుంది .

మరో మూడు నాలుగు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. మూడవసారి అధికారంలోకి రావాలని అనుకుంటున్న కేసీఆర్ మొత్తం 119 నియోజకవర్గాలపై సీరియస్ గా ద్రుష్టి సారించారు . ఈసారి బీఆర్ యస్ కు వ్యతిరేకత ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి.సహజంగానే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటుంది . అందువల్ల ప్రతి సీటు గెలుపు కీలకంగా మారింది .ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత రెండు ఎన్నికల్లో ఒక్కొక్క సీటు మాత్రమే విజయం సాదించగలిగిన సంగతి విదితమే . వీటికి కారణాలు అనేకం …ఈసారి అధిక సీట్లు పొందాలని అనుకుంటే బీఆర్ యస్ కు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు అనేకమంది పార్టీని వీడారు . దీంతో జిల్లాలో పరిస్థితి పార్టీకి ప్రతికూలంగా ఉంది .సీనియర్ నేత తుమ్మల గత ఎన్నికల్లో ఓడిపోయారు . నాటినుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న తుమ్మల ఖమ్మం లో జరిగిన బీఆర్ యస్ బహిరంగసభ సందర్భంగా సీఎం కేసీఆర్ సూచనమేరకు హరీష్ రావు తుమ్మల ఇంటికి వెళ్లి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని చేసిన అభ్యర్థనను అంగీకరించి పార్టీలో యాక్టీవ్ అయ్యారు . అయితే తిరిగి పాలేరు నుంచి పోటీచేయాలని ఆలోచనలో ఉన్నారు . సీటు ఇస్తారా ..లేదా ..అనేది పక్కన పెడితే తుమ్మల శక్తి సామర్ధ్యాలను ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు . అది ఎలా ఉంటుంది. ఆయనకు ఎలాంటి పదవి కట్టపెడతారు అనేది ఆసక్తిగా మారింది. తుమ్మల కూడా కేసీఆర్ పట్ల గౌవరభావంతోనే ఉన్నారు . వారి ఇద్దరి మధ్య అంతకు ముందు ఉన్న స్నేహం , తెలంగాణ ఏర్పడిన తర్వాత తనను పిలిచి మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీ చేశారనే విశ్వాసం తుమ్మల మనుసులో ఉంది .పైగా జిల్లాలో విస్తృత సంబంధాలు ఉన్నాయి . అంతకు ముందు జిల్లాలో ఆయన చేసిన అభివృద్ధి పనులు ప్రజల మనుషుల్లో చెరగని ముద్ర వేశాయి. ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గ పరిస్థితి తెలిసిన వ్యక్తి. ఎక్కడ ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన తుమ్మలకు జిల్లాలో ఎన్నికల సమన్వయ భాద్యత అప్పగిస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయని అభిప్రాయాలు ఉన్నాయి. జిల్లాకు ఇప్పటికే ఎన్నికల ఇంచార్జిగా మంత్రి హరీష్ రావు ను నియమించారు . హరీష్ కు తుమ్మల తోడైతే జిల్లాలో ఎక్కువ సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని బీఆర్ యస్ వర్గాలు భావిస్తున్నాయి …

Related posts

రాహుల్‌పై ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ప్ర‌శ్నల వ‌ర్షం!

Drukpadam

తెలంగాణాలో మళ్ళీ టీఆరెస్సే …ఆరా సర్వే మస్తాన్ వలీ!

Drukpadam

పంజాబ్ ప్రజల్లో నాపై నమ్మకం తగ్గలేదు : మాజీ సీఎం అమరిందర్ …

Drukpadam

Leave a Comment